స్టార్ హీరో సూర్య - జ్యోతిక జంట `2 డి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో వరుసగా క్రేజీ చిత్రాల్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అమెజాన్ ప్రైమ్ తో భారీ డీల్ కుదిరింది. జై భీమ్- ఉదన్ పిరప్పే- ఓ మై డాగ్- రామ్ ఆండలం రావణే ఆండలం సహా నాలుగు చిత్రాల ఒప్పందాన్ని అమెజాన్ ప్రైమ్ తో కుదుర్చుకుంది. ఈ సినిమాలు ఈ ఏడాది విడుదలవుతాయి.
తాజా సమాచారం మేరకు 2డి ఎంటర్ టైన్ మెంట్స్ పేరుతో నకిలీ కాస్టింగ్ ఏజెంట్ హల్ చల్ బయటపడింది. అతడు పలువురిని మోసం చేసి డబ్బు దోచుకున్నాడని తెలుస్తోంది. ఈ విషయం బయటపడగానే సూర్య టీమ్ ఎలెర్ట్ అయ్యారు. ఔత్సాహిక నటీనటులు కొత్తవారిని హెచ్చరించారు.
ప్రొడక్షన్ హౌస్ వారి సోషల్ మీడియా ఖాతాల పేరుతో నకిలీలను గుర్తించారు. మోసం గురించి షాకింగ్ వార్తలను 2డి సంస్థ పంచుకుంది. ఒక మోసగాడు తమ బ్యానర్ లోగోతో పాటు నకిలీ ఇమెయిల్ ఐడిని సృష్టించాడు. కాస్టింగ్ కాల్స్ ప్రకటించి దీనికి డబ్బు చెల్లించాలని కోరాడు. అయితే ఈ విషయం బయటపడగానే ప్రొడక్షన్ హౌస్ అలెర్టయ్యి హెచ్చరించింది. నష్టాన్ని నివారించడానికి వేగంగా స్పందించింది. 2D ఎంటర్ టైన్ మెంట్ పేరును ఉపయోగించి నకిలీ ఇమెయిల్ ఐడిని (2dentertainment.gokul@gmail.com) సృష్టించి ఆడిషన్స్ కోసం ఔత్సాహికులను ఆహ్వానించడమే గాక డబ్బు చెల్లించాలని సదరు ఘరానా మోసగాడు కోరాడు.
బ్యానర్ పేరు లోగోను దుర్వినియోగం చేసి నమ్మిన వారిని మోసం చేయడానికి ప్రయత్నించిన ఈ మోసగాడిపై 2D ఎంటర్ టైన్ మెంట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆడిషన్స్ కోసం పిలిచినా ఎవరూ వెళ్లవద్దు.. నటీనటులు జాగ్రత్తగా ఉండాలని వ్యక్తిగత రహస్య సమాచారాన్ని పంచుకోవద్దని అభ్యర్థిస్తూ 2డి సంస్థ బహిరంగ లేఖ రాసింది.