ఇప్పుడు ప్రపంచమంతా వినోదం కోసం ఓటీటీ చుట్టూ ప్రదక్షిణ చేస్తోంది. దాంతో ఓటీటీ సంస్థల మధ్య కూడా ఇంచుమించు గట్టిగానే పోటీ పెరుగుతోంది. ఎవరి మార్కెట్ ను కాపాడుకోవడానికి వాళ్లు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు పండుగ వస్తుందంటే ఏయే సినిమాలు బరిలో ఉన్నాయనే వైపు దృష్టి పెట్టేవారు. ఏ సినిమా బాగుందనే టాక్ వస్తే ఆ థియేటర్ దిశగా అడుగులు వేసేవారు. ఇక ఆ తరువాత టీవీ చానల్స్ కొత్తగా విడుదలైన సినిమాలను పండుగ రోజుల్లో ప్రసారం చేయడం మొదలుపెట్టిన తరువాత, ఆ వైపుకు దృష్టి మళ్లింది. ఇప్పుడు ఆ స్థానంలో ఓటీటీలు వచ్చి చేరాయి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్లకు వెళ్లే అవకాశం లేకపోవడం వలన అంతా కూడా కొత్త సినిమాల కోసం ఓటీటీలను జల్లెడ పడుతున్నారు. ఎక్కడి నుంచి కొత్త సినిమా పలకరుంచనుందా అని ఆసక్తితో గాలింపులు జరుపుతున్నారు. అయితే ఈ వారం ఓటీటీలో సందడి కాస్త గట్టిగానే కనిపిస్తోంది. ఇటీవల థియేటర్లకు వచ్చిన సినిమాలు పెద్దగా గ్యాప్ లేకుండా ఓటీటీ ద్వారా పలకరించడానికి రెడీ అవుతున్నాయి. ఆ జాబితాలో ముందుగా 'వరుడు కావలెను' కనిపిస్తోంది. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నాగశౌర్య - రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో తెరకెక్కింది. అందువలన ఓటీటీలో ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుందని అనుకుంటున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 7వ తేదీ నుంచి ZEE 5లో స్ట్రీమింగ్ కానుంది. ఇక నాగశౌర్య మరో సినిమా అయిన 'లక్ష్య' కూడా ఓటీటీ బాటపట్టింది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా, విలువిద్య నేపథ్యంలో కొనసాగుతుంది. కేతిక శర్మ కథానాయికగా అలరించిన ఈ సినిమా ఈ నెల 7వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.
ఇక ఈ వారం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మీదికి తమిళ సినిమాలు కూడా వస్తున్నాయి. హిప్ హాప్ తమిళ కథానాయకుడిగా నటించిన 'అన్బరివు' యాక్షన్ డ్రామా జోనర్లో రూపొందింది. ఈ సినిమా నేరుగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తోంది. ఈ నెల 7వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'జైల్' కూడా ఈ నెల 7వ తేదీ నుంచి సింప్లీ సౌత్ ఫ్లాట్ ఫామ్ పై స్ట్రీమింగ్ కానుంది. వసంత బాలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఓటీటీ నుంచి మంచి రెస్పాన్స్ రావొచ్చునని అనుకుంటున్నారు.