మళ్లీ శుక్రవారం వచ్చేసింది. సినిమా పండుగకు తెర లేచింది. వారం మొత్తం ఎలా ఉన్నా.. శుక్రవారానికి కొత్త సినిమాలు బాక్సాఫీస్ క్యూలోకి వచ్చేయటం.. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటం తెలిసిందే. మొదటి వేవ్ తో పోలిస్తే.. రెండో వేవ్ లో ప్రభుత్వం థియేటర్లు.. మల్టీఫ్లెక్సులు తెరుచుకొమ్మని చెప్పిన తర్వాత కూడా.. తెరవని వైనం కనిపిస్తుంది. సర్కారు ఓకే చెప్పిన తర్వాత కూడా థియేటర్లు తెరవకపోవటానికి కారణం.. ఏపీలోని థియేటర్లకు ఇచ్చిన షర్మిషన్లు పరిమితులతో కూడుకున్నవి కావటంతోనే.
సెకండ్ వేవ్ తర్వాత సినిమా థియేటర్లు తెరుచుకున్న రెండో వారమిదే. మొదటి వారంలో వచ్చిన సినిమాల్లో రెండింటిపైనే అంచనాలు ఎక్కువగా ఉండటం.. ఆ రెండింటిలో అంచనాలున్న ఇష్క్ తుస్ మంటే.. ఓ మోస్తరు అంచనాలతో బరిలోకి దిగిన తిమ్మరసు మాత్రం ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. అయితే.. దానికి రావాల్సినంత పేరు కూడా రాలేదని చెప్పాలి. ఇదే సినిమా.. రోటీన్ రోజుల్లో వచ్చి ఉంటే.. నిర్మాత మంచిగా లాభపడేవాడన్న మాట వినిపిస్తోంది. సినిమాకు మంచి టాక్ రావటంతో.. కలెక్షన్లు కాకున్నా.. ఇతరత్రా అంశాల్లో కాసిన్ని డబ్బులు మిగిలే అవకాశం ఉందని చెప్పాలి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన సినిమాలు.. తాజాగా విడుదలవుతున్న సినిమాల్ని చూస్తే.. ఆసక్తికరమైన విషయం ఒకటి కనిపిస్తుంది. గత వారం విడుదలైన సినిమాలన్ని దాదాపుగా రెండు గంటల నుంచి రెండు గంటల ఐదు నిమిషాలకే పరిమితం కావటం గమనార్హం. సాధారణంగా తెలుసు సినిమాలు 2 గంటల పది నిమిషాల నుంచి 2 గంటల 15 మధ్య వరకు రన్ టైం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. పెద్ద హీరోల సినిమాలు మాత్రం 2 గంటల 25 నిమిషాలకు కాస్త అటు ఇటుగా ఉండటం కనిపిస్తుంది. తాజాగా రిలీజ్ అయిన.. అవుతున్న సినిమాలు మాత్రం అందుకు భిన్నంగా 2 గంటలకు కాస్త అటు ఇటుగా ఉండటం విశేషంగా చెప్పాలి.
గత వారం విడుదలైన సినిమాల్లో కాస్త హైప్ క్రియేట్ అయిన సినిమాల్లో మొదటిది ఇష్క్.. దీని రన్ టైం 2 గంటల 2 నిమిషాలు మాత్రమే. దీనికి పోటీగా థియేటర్లకు వచ్చిన తిమ్మరసు షో టైం కూడా 2 గంటల 7 నిమిషాలు మాత్రమే. ఇక ఈ వారం విడుదలయ్యే సినిమాల్లో రెండింటిని తప్పించి మిగిలిన తెలుగు సినిమాలన్ని 2 గంటలకు కాస్త అటు ఇటుగా మాత్రమే ఉన్నాయి. విడుదలకు ముందే.. పాటలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో వివాదానికి తెర తీసి.. పోలీసుల కంప్లైంట్ వరకు వెళ్లి.. ఆ తర్వాత బుద్దిగా చెంపలేసుకోవటం ద్వారా వివాదాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చిన మూవీ ఇప్పుడు ‘‘కాక మరెప్పుడు’’. ఈ సినిమా షో టైం 2 గంటల 4 నిమిషాలు మాత్రమే.
ఇక ‘మెరిసే మెరిసే’ మూవీ అయితే కేవలం 2 గంటల 2 నిమిషాలు మాత్రమే రన్ టైం. మరో మైవీ ‘ముగ్గురు మొనగాళ్లు’ మూవీ అయితే 2 గంటలకే పూర్తి అవుతుందని చెబుతున్నారు. ‘మ్యాడ్’ పేరుతో రిలీజ్ అయిన ఈ మూవీ అయితే.. 2 గంటల కంటే తక్కువగా.. మరింత కచ్ఛితంగా చెప్పాలంటే 1 గంట 51నిమిషాలకే సినిమా పూర్తి అవుతుందట. అయితే.. రెండు సినిమాలు మాత్రం ఒకింత రన్ టైం ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి.
ఈ వారం క్రేజ్ ఉన్న సినిమాల్లో ఒకటి.. ఎస్ఆర్ కల్యాణమండపం. ఈ మూవీ 2.28 గంటల షో టైం కాగా.. మరో చిన్న మూవీ ‘క్షీరసాగర మధనం’ కూడా షో టైం ఎక్కువగా ఉండటం గమనార్హం. వరుస పెట్టి విడుదలవుతున్న అన్ని సినిమాల షో టైంను 2 గంటలకు పరిమితం కాగా.. రెండు సినిమాలు మాత్రమే రెండున్నర గంటల వరకు రావటం విశేషం. మరి.. ఈ వారం ఏ సినిమా విజేతగా నిలుస్తుందో చూడాలి.