సినిమా ఇండస్ట్రీని పైరసీ ఎంతగా భయపెడుతుందో చూస్తూనే ఉన్నాం. గతంలో ఒకటీ అరా సన్నివేశాలు, పాటలు నెట్ లో దర్శనమివ్వడం జరుగుతోంది. ఇప్పుడు అసలు రిలీజ్ కంటే ముందే సినిమా మొత్తం నెట్ లో కనిపించే సందర్భాలు కూడా పెరుగుతున్నాయి. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అత్తారింటికి దారేది ఈ సమస్యకు ఆరంభం అయింది.
రీసెంట్ గా సెన్సార్ వివాదంతో టాక్ ఆఫ్ బాలీవుడ్ అయిన ఉడ్తా పంజాబ్ కూడా.. రిలీజ్ కంటే ముందే సినిమా మొత్తం నెట్ లో దర్శనమిచ్చింది. టాలీవుడ్ - బాలీవుడ్ తర్వాత.. ఈ సమస్య కోలీవుడ్ కి పాకింది. ఉనక్కు ఇన్నోరు పేరు ఎరుక్కు అనే టైటిల్ పై సినిమా చేశాడు జీవీ ప్రకాష్ కుమార్. స్వతహాగా మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఇతను.. హీరోగా కూడా సక్సెస్ అవుతున్నాడు. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా.. బాగానే ఆడుతోంది.
అయితే రిలీజ్ కంటే ముందే.. నెట్ లో తమ సినిమా పూర్తిగా ఉన్నట్లు గుర్తించింది ఈ మూవీ యూనిట్. దీనిపై చెన్నై నగర పోలీస్ కమిషనర్ కు కంప్లెయింట్ చేసిన యూనిట్.. ఈ చర్య కారణంగా తామెంతో నష్టపోయామని.. బాధ్యులెవరో కనిపెట్టాలని కోరింది. అన్ని ఇండస్ట్రీలను పైరసీ భూతం ఎంతగా వెంటాడుతోందో.. తాజా సంఘటనలు నిరూపిస్తున్నాయి.