వర్మ సినిమాకు గద్దలకొండ మూవీ సెంటిమెంట్‌

Update: 2019-11-28 06:32 GMT
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాకు సెన్సార్‌ బ్రేక్‌ వేసింది. టైటిల్‌ కులాలు మరియు రాజకీయ పార్టీలను రెచ్చగొట్టే విధంగా ఉంది అంటూ సెన్సార్‌ కు అభ్యంతరం చెప్పడంతో రామ్‌ గోపాల్‌ వర్మ కాస్త వెనక్కు తగ్గి సినిమా టైటిల్‌ ను అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా మార్చిన విషయం తెల్సిందే. రేపు ఎట్టి పరిస్థితుల్లో సినిమాను విడుదల చేస్తానంటూ వర్మ చాలా పట్టుదలతో ఉన్నాడు. అయితే ఇంకా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి కాలేదని సమాచారం అందుతోంది.

సెన్సార్‌ పూర్తి చేసి రేపు విడుదల చేసేందుకు వర్మ తనవంతు కృషి చేస్తున్నాడు. ఈ సినిమాను వర్మ పూర్తి వివాదాస్పద అంశాలతో తెరకెక్కించాడు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడని టీజర్‌ మరియు ట్రైలర్‌ లను చూస్తుంటే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. అందరిలో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు టైటిల్‌ చేంజ్‌ అవ్వడంతో కొందరు నెటిజన్స్‌ ఒక వింతైన సెంటిమెంట్‌ ను వర్మ సినిమాకు అంట కడుతున్నారు.

ఇటీవల మెగా హీరో వరుణ్‌ తేజ్‌ 'వాల్మీకి' సినిమా టైటిల్‌ ను విడుదల ముందు రోజు 'గద్దలకొండ గణేష్‌' అంటూ మార్చారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ సినిమా కూడా గద్దలకొండ గణేష్‌ మాదిరిగా సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యి సక్సెస్‌ అవుతుందేమో అంటూ వర్మ అభిమానులు నెట్టింట్ట కామెంట్స్‌ చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో సినిమాను రేపు విడుదల చేయాలంటూ వర్మ అభిమానులు ఆయన్ను సోషల్‌ మీడియా వేదికగా కోరుతున్నారు. మరి వర్మ ఏం ప్రయత్నాలు సఫలం అయ్యి రేపు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యేనో చూడాలి.
Tags:    

Similar News