వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'పవర్ స్టార్' అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ పార్టీ స్థాపించి ఎన్నికలలో ఓడిపోయిన ఓ స్టార్ హీరో స్టోరీ అని.. ఏ వ్యక్తికైనా దగ్గర పోలికలు ఉంటే అది యాదృచ్చికంగా జరిగింది మాత్రమేనని చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు వర్మ. ఇప్పటికే 'పవర్ స్టార్' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ పవన్ కళ్యాణ్ ని పోలిన వ్యక్తిని హీరోగా చూపిస్తున్నారు. సెటైరికల్ మూవీగా వస్తున్న 'పవర్ స్టార్' సినిమా జూలై 25న ఉదయం 11 గంటలకు థియేటర్లో విడుదల కానున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమా ట్రైలర్ జూలై 22న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నామని.. 25 రూపాయలు చెల్లించి ట్రైలర్ చూడొచ్చని పేర్కొన్నాడు. మరికొద్ది రోజులలో మూవీ విడుదల కానున్న నేపథ్యంలో వర్మ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో 'పవర్ స్టార్' సినిమా నుంచి "గడ్డి తింటావా..?" అనే మొదటి పాటని తాజాగా విడుదల చేసారు. www.rgvworldtheatre.com
రామ్ గోపాల్ వర్మ ఈ సాంగ్ రిలీజ్ చేస్తూ పవర్ స్టార్ సినిమాలోని హీరో తన గేదెలకు పాడిన పాట "గడ్డి తింటావా..?" అని పేర్కొన్నాడు. 'గడ్డి తింటావా.. తౌడు తింటావా.. నా బుజ్జి గేదెమ్మ నువ్వు కుడిత తాగుతావా'' అంటూ స్టార్ట్ అయిన ఈ సాంగ్ ఆద్యంతం సెటైరికల్ గా సాగింది. ''ఎన్నికల్లో గెలిచి ఎప్పుడు చల్లగ పాలిస్తానో.. నువ్వు మాత్రం ఎప్పుడు తెల్లని పాలిస్తావు.. '' అని పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ని మిమిక్రీ చేస్తూ ఈ సాంగ్ పాడారు. 'మనుషులనే నమ్మి మోసపోయాను.. ఓటేస్తారనుకుంటే వెన్నుపోటేసారు.. ఆహ్ ఆ'' అంటూ పవన్ కళ్యాణ్ మేనరిజంతో హీరో ఈ పాట పాడినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ''నన్ను దేవుడన్నాడు ఒకడు.. నాకు డైలాగ్ ఇచ్చాడు ఒకడు.. నెత్తికెక్కించుకున్నాడు ఒకడు.. అందరూ కలిసి ముంచేశారు..'' అంటూ బండ్ల గణేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ - నారా చంద్రబాబు నాయుడిని పోలిన వ్యక్తులను ఈ సాంగ్ లో చూపించాడు వర్మ. 'పులి లాంటోడిని పిల్లిని చేసారు' 'ఫాల్స్ విజిల్స్ కొట్టారు.. పవర్ స్టార్ అన్నారు.. పవర్ ఇమ్మని కోరితే స్టార్స్ చూపించారు' లాంటి లిరిక్స్ తో వర్మ డైరెక్టుగానే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విడుదలకు ముందే ఇన్ని కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తున్న వర్మ 'పవర్ స్టార్' రిలీజ్ తర్వాత ఎలాంటి సంచలనాలు రేపుతుందో అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Full View