టాలీవుడ్డోళ్లను గాలి ఎలా ఆహ్వానించాడంటే..

Update: 2016-11-01 14:48 GMT
చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు.. కేసుల్లో చిక్కుకున్నా.. జైలు జీవితం అనుభవించినా.. గాలి జనార్దన రెడ్డి దర్పం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తన కూతురి పెళ్లి సందర్భంగా ఆయన తయారు చేయించిన వెడ్డింగ్ కార్డ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బహుశా ఇండియాలో అత్యంత ఖరీదైన వెడ్డింగ్ కార్డ్ ఇదే అయ్యుంటుందేమో. ఐతే గాలి దర్పం వెడ్డింగ్ కార్డును రూపొందించడం వరకే పరిమితం కాలేదు. దాన్ని అతిథులకు అందజేసే విషయంలోనూ తన స్థాయిని చూపిస్తున్నాడు గాలి. ఇంటింటికీ వెళ్లి వెడ్డింగ్ కార్డులు పంచడం కాకుండా.. వీటిని అందజేయడం కోసమే ఓ భారీ పార్టీ ఏర్పాటు చేశాడు గాలి.

టాలీవుడ్ సెలబ్రెటీలందరినీ పెళ్లికి పిలవడం కోసం గాలి.. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో గ్రాండ్ కాక్ టైల్ పార్టీ ఏర్పాటు చేయడం విశేషం. ఈ పార్టీకి టాలీవుడ్ ప్రముఖులందరినీ రప్పించి.. అక్కడే వెడ్డింగ్ కార్డులు పంచాడు గాలి. ఈ పార్టీ ఓ రేంజిలో జరిగిందని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. దీన్ని బట్టి ఇక గాలి వారింట పెళ్లి వేడుక ఏ స్థాయిలో జరుగుతుందో అంచనా వేయొచ్చు. నవంబరు మధ్యలో గాలి కూతురి పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లి తర్వాత గాలి టాలీవుడ్లో సినిమాలు నిర్మించాలని భావిస్తున్నాడట. ఇందుకోసం  ఇప్పటికే సన్నాహాలు కూడా పూర్తి చేసినట్లు సమాచారం. పెళ్లి తర్వాత తమ ప్రొడక్షన్ హౌజ్.. సినిమా ప్రణాళికల గురించి గాలి ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News