'ప్రపంచమే ఒక పాఠశాల .. అనుభవాలే పాఠాలు' అని సెలవిచ్చారు ఒక కవిగారు. అలా ప్రతి ఒక్కరి జీవితం అనేక మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఉంటాయి .. మరెన్నో అనుభూతులు ఉంటాయి. చేదు జ్ఞాపకాలు కూడా జీవితం చివరివరకూ నీడలా వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి జీవితాల్లో నుంచి పుట్టిన కథలు ప్రేక్షకులకు త్వరగా కనెక్ట్ అవుతాయి. సహజత్వానికి దగ్గరగా నడిచే ఆ పాత్రలను పట్టుకుని ప్రేక్షకులు చివరి వరకూ నడుస్తారు. అలా వాస్తవ సంఘటనలకు దగ్గరగా నడిచే కథతో రూపొందిన సినిమానే 'గమనం'.
శ్రియ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి సుజనా రావు దర్శకత్వం వహించారు. కరుటూరి రమేశ్ .. వెంకీ పుషడపు .. జ్ఞానశేఖర్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. శివ కందుకూరి .. ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన ఈ సినిమాలో, నిత్యామీనన్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో పాత్రలు పరిమితంగా ఉన్నప్పటికీ వాటి తాలూకు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి పాత్ర ఒక ప్రయోజనాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫర్ గా పని చేసిన ఈ సినిమాకి, ఇళయరాజా సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆల్రెడీ తెలుగులో పవన్ కల్యాణ్ తోను .. ఇతర భాషల్లో సోనూసూద్ .. శివరాజ్ కుమార్ .. జయం రవితోను ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. తాజాగా తెలుగు వెర్షన్ కి సంబంధించిన రిలీజ్ డేట్ ను మేకర్స్ ఎనౌన్స్ చేశారు. డిసెంబర్ 10వ తేదీని ఈ సినిమాను విడుదల చేయనున్న విషయాన్ని అధికారిక పోస్టర్ ద్వారా తెలియజేశారు.
త్వరలోనే ఇతర భాషల్లో ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయనున్నది ప్రకటించనున్నారు. ఈ సినిమాలో చారుహాసన్ .. సుహాస్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. నిత్యా మీనన్ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమాకి వారం రోజుల ముందు 'అఖండ' .. వారం రోజుల తరువాత 'పుష్ప' ఉన్నాయి. రెండు భారీ సినిమాల మధ్య ఈ సినిమా విడుదలవుతోంది. అయితే బలమైన కథాకథనాలతో రూపొందిన తమ సినిమాపై మేకర్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.