చైల్డ్ ఆర్టిస్టులలో కొంతమంది మాత్రమే ఆ తరువాత కాలంలో హీరోలుగా .. హీరోయిన్లుగా కొనసాగారు. శ్రీదేవి .. మీనా కూడా చైల్డ్ ఆరిస్టులుగా తెరపైకి వచ్చేసి ఆ తరువాత హీరోహీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగినవారే. ఆ తరువాత ఆ స్థాయిలో పాప్యులర్ అయిన చైల్డ్ ఆర్టిస్టులు లేరు. అయితే మళ్లీ ఇంతకాలానికి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్ గా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది .. ఆమె పేరే కావ్య. 'మసూద' అనే సినిమాతో తను కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది.
తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొంది. తన కెరియర్ కి సంబంధించిన విషయాలను గురించి కావ్య మాట్లాడుతూ .. "ఠాగూర్ .. బాలు .. గంగోత్రి .. బన్నీ .. ప్రభాస్ అడవిరాముడు .. సుభాస్ చంద్రబోస్ .. ఇలా చైల్డ్ ఆర్టిస్టుగా 12 సినిమాల వరకూ చేశాను. హీరోయిన్ గా 'మసూద' నా ఫస్టు మూవీ. 'మసూద' అనేది ఉర్దూ పదం .. గుడ్ ఉమెన్ అని అర్థం. 'మసూద' సినిమా ఓ హారర్ డ్రామా. ఇలాంటి ఒక హారర్ డ్రామా మన తెలుగులో ఈ మధ్య కాలంలో రాలేదు. తిరువీర్ .. సంగీత ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు.
చిన్నప్పుడు నేను ఏం చేసినా ... ఎలా చేసినా బాగుందని అనేవారు. ఇప్పుడు నటించడానికి బాగానే కష్టపడవలసి వస్తోంది. అప్పట్లో ప్లే గ్రౌండ్ కి అనగానే ఎలా వెళతారో .. షూటింగుకి అంటే నేను అలా వెళ్లేదానిని. పరీక్షలు ఎగ్గొట్టేసి నేను షూటింగుకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.
ఇక ఇలా అయితే చదువు దెబ్బతుంటుందని భావించి, 12 ఏళ్లపాటు సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చాను. 'లా' పూర్తి చేసిన తరువాత మళ్లీ సినిమాలు చేయాలనే ఒక ఆసక్తితో ఇటు వైపు వచ్చాను. ఇందులో అమ్మానాన్నల బలవంతం ఏమీ లేదు.
కోవిడ్ సమయంలో ఖాళీ సమయం ఎక్కువగా దొరికింది. నేను సినిమాల్లోకి వెళితే బాగుంటుందనే నిర్ణయాన్ని అప్పుడే తీసుకున్నాను. ఆ తరువాత నా దగ్గరికి ఈ స్క్రిప్ట్ వచ్చింది. కథ వినగానే నాకు బాగా నచ్చేసింది .. అంతే వెంటనే అంగీకరించాను.
అసలు నేను హీరోయిన్ అవుదామని అనుకున్నప్పుడు ఫస్టు వెళ్లి కలిసింది రాఘవేంద్రరావు గారినే. అరే .. రెండు నెలల ముందుగా నన్ను కలిసి ఉంటే 'పెళ్లిసందD' సినిమాలోకి తీసుకునేవాడినే అని ఆయన అన్నారు. ఆయనతో మళ్లీ చేసే అవకాశం పోయిందే అని చాలా బాధపడడ్డాను" అంటూ చెప్పుకొచ్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.