శాతకర్ణి కలెక్షన్స్.. మైండ్ బ్లోయింగ్ అంతే

Update: 2017-01-16 09:46 GMT
నందమూరి బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టయిన ‘లెజెండ్’ అమెరికాలో ఫుల్ రన్లో సాధించిన వసూళ్లు 4.1 లక్షల డాలర్లే. తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ.. కొంచెం క్లాస్ టచ్ ఉన్న చిత్రాల్నే ఆదరించే అమెరికాలో మాత్రం బాలయ్య సినిమాలకు ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది మొన్నటిదాకా. ఐతే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మాత్రం ఆ హద్దులన్నీ చెరిపేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంత బాగా ఆడుతోందో.. అమెరికాలోనూ అలాగే అదరగొడుతోంది ఈ సినిమా. మామూలుగా అమెరికాలో తెలుగు సినిమాలకు ప్రిమియర్లకు.. వచ్చినంత కలెక్షన్లు ఆ తర్వాత రావు.

ప్రిమియర్లకు టికెట్ల రేట్లు ఎక్కువగా ఉంటాయి. పైగా జనాల్లో క్రేజ్ కూడా ఎక్కువే ఉంటుంది. కానీ మరుసటి రోజు నుంచి కలెక్షన్లు పడిపోతాయి. కానీ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలో అలా జరగట్లేదు. కలెక్షన్లు స్టడీగా సాగుతున్నాయి. ప్రిమియర్లతో 3.6 లక్షల డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం.. మూడో రోజైన శనివారం కూడా 3.2 లక్షల డాలర్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. దీంతో తనకు కలగా ఉన్న మిలియన్ డాలర్స్ మార్కును బాలయ్య ఈజీగా అందుకున్నాడు. వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమా కలెక్షన్లు స్టడీగానే ఉన్నట్లు సమాచారం. ఫస్ట్ వీకెండ్లో చిరు సినిమా ‘ఖైదీ నెంబర్ 150’నే ఆధిపత్యం చలాయించినప్పటికీ.. రెండో వీకెండ్లో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లీడర్ అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాకు అక్కడ అంత మంచి టాక్ ఉంది. కలెక్షన్లలో మేజర్ డ్రాప్ కూడా లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News