నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా చరిత్రలో నిలిచిపోయేలా రూపొందిస్తున్నారు. టాలీవుడ్ చరిత్రలో చిరస్థాయికి నిలిచిపోయే చిత్రరాజాల సరసన గౌతమిపుత్ర శాతకర్ణి ఉండాలన్నది ఆయన ఆలోచనం. అందుకే శాతవాహన చక్రవర్తి శాతకర్ణి కథను ఎంచుకున్నారు. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తికావచ్చిన ఈ చిత్రం.. జనవరి 11న రిలీజ్ కానుందని అనౌన్స్ చేసేశారు.
రిలీజ్ డేట్ కి 3 వారాల ముందే ఫస్ట్ కాపీ చేతిలోకి వచ్చేలా ప్రణాళికలు ఉన్నాయి. అక్కడి నుంచి ప్రమోషన్స్ భారీగా చేపట్టనున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం కూడా స్పెషల్ గా ప్రదర్శించనున్నారట. జనవరి 3వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుల కోసం ప్రత్యేకంగా షో వేయనున్నారని తెలుస్తోంది.
గౌతమిపుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవం కేసీఆర్ చేతుల మీదుగానే జరిగింది. ఇప్పుడు ఆడియో రిలీజ్ ను చంద్రబాబుతో చేయించాలని భావిస్తున్నారట బాలయ్య. అయితే.. ఆడియో విడుదలకు వెన్యూ ఇంకా నిర్ణయించలేదు. అమరావతితోపాటు విశాఖ పట్నం.. తిరుపతిలను కూడా పరిశీలిస్తున్నారు శాతకర్ణి మేకర్స్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/