ఈ ఏడాది ప్రారంభంలో నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన 100 చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ అయింది. క్రిష్ దర్శకత్వంలో 7-8 నెలల సమయంలోనే గ్రాఫిక్ మాయాజాలంతో తెరకెక్కిన ఈ మూవీని ప్రేక్షకులు బాగా ఆదరించారు. తెలుగు చక్రవర్తి చరిత్రకు అమోఘమైన స్పందన లభించింది. బాలయ్య కెరీర్ లో తొలి 50 కోట్ల షేర్ వసూళ్లను సాధించిన మూవీగా నిలిచింది.
ఇప్పుడు బాహుబలి2 వచ్చింది. ఐదేళ్ల పాటు రాజమౌళి టీం- ప్రభాస్ లు పడ్డ కష్టానికి ప్రతిఫలం. కలెక్షన్స్ విషయంలో దేశంలోని అన్ని రికార్డులను బాహుబలి2 బద్దలు కొట్టేయడం ఖాయం. కానీ అవార్డుల విషయానికి వచ్చేసరికి లెక్కలు తేడాగా ఉంటాయి. ఓవరాల్ గా సినిమాను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు సంస్థల అవార్డులు.. వారి ప్రాధాన్యతలను అనుసరించి మార్కెటింగ్ కు వీలుగానే ఉంటాయి. మరి నంది.. ఫిలింఫేర్.. నేషనల్ అవార్డుల సంగతేంటి?
బాహుబలి2.. శాతకర్ణి చిత్రాలు పలు విభాగాల్లో పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తమ నటుడు.. ఉత్తమ నటి.. ఉత్తమ దర్శకుడు.. ఉత్తమ చిత్రం.. గ్రాఫిక్స్ ఇలా పలు విభాగాల్లో పోటీ తప్పదు. బాహుబలి1 కంటే రెండో భాగంలో ప్రమాణాలు తగ్గాయనే ప్రేక్షకుల అభిప్రాయాల నేపథ్యంలో.. రెండు సినిమాల అవార్డులకు గట్టి పోటీ తప్పకపోవచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/