అలా మిస్ అయిన తమిళవాసి

Update: 2018-01-12 11:50 GMT
విడుదలకు ముందు వివాదాలతో - విడుదల తర్వాత విమర్శలతో అజ్ఞాతవాసి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ ని స్పూర్తిగా తీసుకున్నారు, కాపీ కొట్టారు అనే కామెంట్స్ మధ్య తెరవెనుక జరిగిన ఒప్పందంతో దాన్ని సర్దేసారు అనే వార్త ఇప్పటికీ చల్లారలేదు. ఇక ఈ ఫ్రెంచ్ సినిమా మీద గతంలో చాలా మంది దర్శకులే కన్ను వేసారని ఇటీవలే రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. టాప్ లీగ్ లో నలుగురైదుగురు దర్శకులు వివిధ సందర్భాల్లో దీన్ని తీసే ఆలోచన చేసి మానుకున్నారు అని కూడా చర్చ జరిగింది. తమిళ్ లో కల్ట్ మూవీస్ డైరెక్టర్ గా పేరున్న గౌతం మీనన్ కూడా దీన్ని రీమేక్ చేయాలన్న తలంపుతో విజయ్ హీరోగా ఫోటో షూట్ చేసి టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కాని ఇది ఇప్పటి సంగతి కాదు. కొన్నేళ్ళ క్రితం విజయ్ హీరోగా గౌతం మీనం యోహన్-అధ్యాయం ఒండ్రు అనే పేరుతో ఒక ఫోటో షూట్ చేసి ఫస్ట్ లుక్ తరహాలో పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. కాని అది సెట్స్ పైకి వెళ్ళకుండానే ఆగిపోయింది. అది డేట్స్ వల్ల వచ్చిన సమస్యనో లేక సబ్జెక్టు మీద పూర్తి నమ్మకం కలగకపోవడం వల్లనో మొత్తానికి అయితే ఆగిపోయింది. ఒకవేళ అదే కనక జరిగి ఉంటే గౌతం మీనన్ తన తరహాలో చాలా స్టైలిష్ గా యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దేవాడు. అవసరం లేని కామెడీ ఇరికించడం గౌతం ఎన్నడు చేయలేదు.

అదే కనక తీసేసి విడుదల చేసి ఉంటె దాని డబ్బింగ్ వెర్షన్ లేదా రీమేక్ వెర్షన్ ఏదో ఒకటి తెలుగులో జరిగేది. అప్పుడు పవన్ తో అజ్ఞాతవాసి పేరుతో ఈ ప్రయోగం చేసేది తప్పిపోయేది.అయినా ప్రతిది మన చేతుల్లో ఉండదు. తీసే ప్రతి సినిమా మీద హీరో పేరు రాసి ఉంటుంది అన్నట్టు ఇది పవన్ కే రాసి పెట్టుంది. ఇలా అనుకుని ఫోటో షూట్ చేసి ఆగిపోయిన సినిమాలు గతంలో చాలానే ఉన్నప్పటికీ అజ్ఞాతవాసి వల్ల విజయ్ పాత సంగతి బయటికి వచ్చింది. 
Tags:    

Similar News