ఎడిట‌ర్ గౌత‌మ్ రాజు ఫ్యామిలీకి మెగాస్టార్ సాయం

Update: 2022-07-06 10:30 GMT
ప్ర‌ముఖ సినిమా ఎడిట‌ర్ గౌత‌మ్ రాజు (68) క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. గ‌త కొంత కాలంగా అనారోగ్య కార‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న మంగ‌ళ‌వారం అర్థ్రరాత్రి హైద‌రాబాద్ లోని స్వ‌గృహంలో క‌న్నుమూశారు.

సీనియ‌ర్ ఎడిట‌ర్‌గా ఎన్నో వంద‌ల చిత్రాల‌కు వ‌ర్క్ చేసిన గౌత‌మ్ రాజ్ మ‌ర‌ణ వార్త‌తో సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాద ఛాయాలు అలుముకున్నాయి. ఆయ‌న మృతిపై ప‌లువురు సినీ ప్ర‌ముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యారు.

ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు త‌మ ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. టాలీవుడ్ లో సీనియ‌ర్ ఎడిట‌ర్ గా గ‌త కొన్నేళ్లుగా సేవ‌లందిస్తున్నారాయ‌న‌.

తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల‌లో అనేక చిత్రాల‌కు ఎడిట‌ర్ గా వ‌ర్క్ చేశారు. నాలుగు భాష‌ల్లో దాదాపు 850కి పైగా చిత్రాల‌కు ఎడిట‌ర్ గా వ‌ర్క్ చేసి సినీ ఎడిటింగ్ లో త‌న‌దైన ముద్ర వేశారు. తెలుగులో తెర‌కెక్కిన ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌కు వ‌ర్క్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ వంటి హీరోల చిత్రాల‌కు ఎడిట‌ర్ గా పని చేశారు. గ‌త కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న ఆయ‌న మంగ‌ళ‌వారం అర్థ్ర‌రాత్రి తుది శ్వాస విడిచారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన చిత్రాల‌కు ఎడిట‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. ఆయన మృతి ప‌ట్ల చిరంజీవి తీవ్ర సంపతాపం వ్య‌క్తం చేశారు.

అంతే కాకుండా గౌత‌మ్ రాజు కుటుంబానికి త‌క్ష‌ణ సాయంగా రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల అంద‌జేశారు. ఈ మేర‌కు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఆ రెండు ల‌క్ష‌ల రూపాయాల‌ని గౌత‌మ్ రాజు కుటుంబానికి అంద‌జేశారు. ఏ విష‌యంలో అయినా అండ‌గా నిలుస్తామ‌ని, ధైర్యం కోల్పోవ‌ద్ద‌ని ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట‌గా త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ వెల్ల‌డించారు.
Tags:    

Similar News