ఆ అమ్మాయిని ఇండియాకి రప్పిస్తా

Update: 2015-08-10 16:29 GMT
ఒక ఎనిమిదేళ్ల చిన్నారి పాకిస్తాన్‌ బోర్డర్‌ లో తప్పిపోయింది. తల్లిదండ్రుల నుంచి దూరమైపోయింది. ఆ చిన్నారిని తిరిగి దుర్భేద్యమైన బోర్డర్‌ దాటించి తనవారి చెంతకి చేర్చడానికి ఓ హనుమాన్‌ భక్తుడు ఎలాంటి పాట్లు పట్టాడు? అన్నదే భజరంగి భాయిజాన్‌ సినిమా. సల్మాన్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే 300కోట్లు వసూలు చేసింది. బాహుబలి రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌ రచించిన కథ ఇది. ఎమోషనల్‌ డ్రైవ్‌ తో, కామెడీ కంటెంట్‌ తో తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది టాప్‌ -1 హిట్‌.

సినిమా సంగతి సరే.. కట్‌ చేస్తే సేమ్‌ భజరంగి ఇన్సిడెంట్‌ రియల్‌ లైఫ్‌ లోనూ బైటపడింది. ఓ ఇండియన్‌ గాళ్‌ (పేరు గీత, ఇప్పటి వయసు 23) 15ఏళ్ల వయసులో పాకిస్తాన్‌ బోర్డర్‌ లో తప్పిపోయింది. లాహోర్‌ లోని ఓ రైల్వే స్టేషన్‌ వద్ద ఈ బాలికను చూసిన పోలీస్‌ అక్కడ పని చేసే ఓ ఎన్జీవో సంస్థకి అప్పజెప్పారు. అప్పట్నుంచి ఆ బాలిక తల్లిదండ్రులకు దూరంగా పాకిస్తాన్‌ లోనే ఉండిపోయింది. ఆ అమ్మాయిని తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి ఇటీవలే భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది.

అయితే అందుకు సల్మాన్‌ భాయ్‌ నుంచి కూడా పూర్తి మద్దతు లభించింది. ఇప్పటికే ప్రభుత్వం ఇందులో తలదూర్చింది. లేకపోతే నేను ముందుకు వచ్చి సాయం చేసేవాడిని అని అన్నాడు. ఆ బాలిక తల్లిదండ్రులెవరో కనుక్కుని క్షేమంగా తనని చేర్చేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. తను ఇండియా వస్తే స్వయంగా వెళ్లి కలుసుకుంటానని చెప్పాడు. భాయిజాన్‌ మనసు ఎంత మంచిదో కదా!
Tags:    

Similar News