విడుదలకు ఇంకా వారం పైగా ఉన్నప్పటికీ గీత గోవిందం కోసం ఎదురు చూస్తున్న యూత్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. దానికి కారణం అర్జున్ రెడ్డి తర్వాత ఏడాది గ్యాప్ తో వస్తున్న విజయ్ దేవరకొండ సినిమా కావడం ప్లస్ హైప్ పెంచేలా ప్రమోషన్ వెరైటీగా ప్లాన్ చేయటం. ఇక కథ గురించి పరశురామ్ చెప్పిన దాన్ని బట్టి బయటికి వచ్చిన లీకులను బట్టి చూస్తే లీలగా ఒక క్లారిటీ వస్తోంది. దాని ప్రకారం చూస్తే గోవింద్ అంటే విజయ్ దేవరకొండ జూనియర్ సైంటిస్ట్ కావాలని గోల్ పెట్టుకుంటాడు. దానికి టైం పట్టేలా ఉండటంతో టైం వేస్ట్ చేయకుండా ఉండటం కోసం ఒక కాలేజీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పాఠాలు చెప్పే వృత్తిలో దిగుతాడు. ఆ క్రమంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గీతతో పరిచయమవుతుంది. కానీ పరిచయం ప్రేమ దాకా వెళ్లే లోపే ఇద్దరి మధ్య చిలిపి తగాదాలు గొడవలు ఇలా అల్లరి అల్లరిగా సాగుతుంది. గోవింద్ కు గీత వల్ల సమస్య గీతకు గోవింద్ వల్ల ఇబ్బంది మొదలవుతుంది. అయినా ఇద్దరూ ఒకరికొకరు విడిపోవాలి అనుకోరు. మరి ఈ ప్రేమ కథ పెళ్లి దాకా ఎలా వెళ్తుంది అనేదే కథగా వినికిడి.
ఇది ఊరికే అవుట్ లైన్ గా బయటికి వచ్చింది కానీ అంతకు మించి ఇందులో చాలా ఉంటుందని పరశురామ్ అంటున్నాడు. గీత ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించిన ఈ మూవీకి గోపి సుందర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఛలోతో తొలి బోణినే సక్సెస్ కొట్టి ఊపుమీదున్న కన్నడ భామ రష్మిక మండన్న హీరోయిన్ కావడం మరో ప్లస్ గా మారింది. హీరో లెక్చరర్ గా నటించిన సినిమాలు గతంలో మంచి విజయాలే సాధించాయి. వెంకటేష్ సుందరకాండ తరహాలో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. ఓవర్ సీస్ లో సైతం మంచి ఓపెనింగ్స్ ఆశిస్తున్న గీత గోవిందంలకు ఆగష్టు 15కి తెలుగులో పోటీ లేదు. విశ్వరూపం 2 ఎల్లుండికి వాయిదా పడితే పోటీ ఉండేది కానీ రిలీజ్ కన్ఫర్మ్ కావడంతో ఏ సమస్యా లేదు.