విజయ్ దేవరకొండను ఆయన అభిమానులు కొందరు తెలంగాణ మెగాస్టార్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. నైజాం ఏరియా నుండి వచ్చిన హీరోల్లో విజయ్ దేవరకొండ టాప్ స్టార్ అంటూ ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. వారి ప్రచారంకు, వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా విజయ్ దేవరకొండ తాజాగా ‘గీత గోవిందం’ చిత్రంతో నైజాం నవాబ్ అనిపించుకున్నాడు. కేవలం స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యం అయిన నైజాం 20 కోట్ల క్లబ్‌కు ఒక్క అడుగు దూరంలో విజయ్ దేవరకొండ నిలిచాడు. విడుదలై నాలుగు వారాలు అవుతున్నా కూడా ఇంకా జోరు కొనసాగుతూనే ఉంది.
‘గీత గోవిందం’ చిత్రం నిన్నటి ఆదివారంకు నైజాం ఏరియాలో ఏకంగా 19 కోట్లకు చేరింది. నైజాం ఏరియాలో 20 కోట్లు సాధించిన చిత్రాల సంఖ్య చాలా తక్కువ. వాటి జాబితాలో ఈ చిత్రం నిలవడం దాదాపు ఖాయం అంటూ ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. మరో వారం రోజుల పాటు నైజాం ఏరియాలో గీత గోవిందం చిత్రం సందడి కనిపించే అవకాశం ఉంది. అందుకే 20 కోట్ల క్లబ్ లో ఈ చిత్రం నిలుస్తుందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. చిరంజీవి ఖైదీ నెం.150 చిత్రం 19.55 కోట్లను రాబట్టింది. ఇంకా పలు సూపర్ హిట్ టాక్ దక్కించుకున్న సినిమాలు కూడా నైజాం ఏరియాలో 20 కోట్లకు ముందు ఆగిపోయాయి.
చిరంజీవి ఖైదీతో పాటు ఫిదా - గబ్బర్ సింగ్ - భరత్ అనే నేను - సరైనోడు చిత్రాలు కూడా 20 కోట్లకు కాస్త తక్కువ వసూళ్లను రాబట్టాయి. ఇప్పుడు గోవిందం చిత్రంతో విజయ్ దేవరకొండ నైజాం నవాబ్ అనిపించుకోవాలంటే మరో కోటి రూపాయల షేర్ ను రాబడితే చాలు. ఈనెల 13న శైలజ రెడ్డి అల్లుడు చిత్రం విడుదల కాబోతుంది. ఆ లోపు గోవిందం ఆ మార్క్ ను చేరుకుంటుందో చూడాలి.