జెంటిల్ మేన్ 2.. ఏ.ఆర్.రెహ‌మాన్ ని కొట్టేలా?

Update: 2022-01-23 09:30 GMT
మ‌ర‌క‌త‌మ‌ణి ఎం.ఎం.కీర‌వాణి సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌కు సంగీతం అందించారు. ఇండియన్ సినిమా హిస్ట‌రీని తిర‌గ‌రాసిన బాహుబ‌లి ఫ్రాంఛైజీకి ఆయ‌నే సంగీత ద‌ర్శ‌కుడు. ఇప్పుడు సంచ‌ల‌నాల‌కు రెడీ అవుతున్న ఆర్.ఆర్.ఆర్ కి మ‌ర‌క‌త‌మ‌ణి బాణీలందించారు.

ఇదే కేట‌గిరీలో మ‌రో భారీ చిత్రానికి ఆయ‌న ఆఫ‌ర్ అందుకున్నారు. పాపుల‌ర్ నిర్మాత కెటి నిర్మిస్తున్న `జెంటిల్ మేన్ 2` చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. ఆ మేర‌కు కేటీ అలియాస్ కుంజుమోన్ ఆదివారం నాడు ఈ విష‌యాన్ని అధికారికంగా ప్రకటించారు. ట్విటర్ లో నిర్మాత కేటీ సంగీత దర్శకుడిని సత్కరిస్తున్న ఫోటోను పోస్ట్ చేస్తూ ఇలా అన్నారు. భారతీయ సినిమా దిగ్గజం ఎంఎం కీరవాణి గారు నా జెంటిల్ మన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న `జెంటిల్ మేన్ 2`కి సంగీత దర్శకుడిగా ఉంటారని నేను గర్వంగా ప్రకటిస్తున్నాను.. అన్నారు. అలాగే ఆయ‌న మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా గోల్డ స్కీమ్ ని ప్ర‌క‌టించారు. నిర్మాత ట్విట్టర్ లో అభిమానుల కోసం ఒక పోటీని ప్రకటించారు. తన చిత్రానికి సంగీతం అందించే ప్రముఖ సంగీతకారుడిని అంచనా వేయమని అభిమానులను కోరాడు. #G2MusicDirector అనే హ్యాష్ ట్యాగ్ తో సంగీత దర్శకుడి పేరును సరిగ్గా ట్వీట్ చేసిన వారిలో ముగ్గురు అదృష్టవంతులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి బంగారు నాణెం బహుమతిగా ఇస్తామని నిర్మాత తెలిపారు.

ప్రభుదేవా నటించిన కాద‌ల‌న్.. వినీత్ -అబ్బాస్ నటించిన `ప్రేమ‌దేశం` (కాదల్ దేశం) సహా తమిళంలో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన  కుంజుమోన్ `జెంటిల్ మేన్ `తో శంకర్‌ని దర్శకుడిగా పరిచయం చేసిన ఘనత పొందారు. 1999 తర్వాత సినిమాలను నిర్మించడం మానేసిన ఈ నిర్మాత ఇటీవలే తన బ్లాక్ బస్టర్ `జెంటిల్ మన్` చిత్రానికి సీక్వెల్ తీస్తానని రీసెంట్ గా ప్రకటించాడు. ఇప్పుడు నిర్మాత `జెంటిల్ మేన్ 2` తారాగ‌ణాన్ని ఎంపిక చేస్తున్నారు. టెక్నిక‌ల్ టీమ్ ఎంపిక‌లో భాగంగా సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణిని తొలి పేరుగా ప్ర‌క‌టించారు. శంక‌ర్ జెంటిల్ మేన్ చిత్రానికి ఏ.ఆర్.రెహ‌మాన్ అద్భుత‌మైన సంగీతం అందించారు. ఇప్పుడు అంత‌కుమించి కీర‌వాణి సంగీతాన్ని సృజించాల్సి ఉంటుంది. ఏ.ఆర్.రెహ‌మాన్ ని కొట్టేలా? ఆయ‌న ప్ర‌య‌త్నిస్తార‌నే అభిమానులు అంచ‌నా వేస్తున్నారు.


Tags:    

Similar News