సూప‌ర్ హాల్ లో నేహాశ‌ర్మ కైపెక్కిస్తుందే!

Update: 2022-10-13 08:49 GMT
నేహా శర్మ అందాల సరాగాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బ్యూటీ సామాజిక మాధ్యమాల్లో వెల్లువలా విరుచుకుప‌డుతుంది. ఇన్ స్టాగ్రామ్.. ట్విట్టర్ వంటి మాధ్యమాల్లో  రెగ్యులర్ గా టచ్ లో ఉంటోంది. నిరంతర ఫోటోషూట్లతో సెల్ఫీ షూట్లతో హీటెక్కిస్తుంటుంది. గడిపేస్తోంది.  యూత్లో ఎప్పటికప్పుడుడు  చ‌ర్చ‌కొస్తుంటుంది. రేర్ గా సిస్ట‌ర్ ఐశాశ‌ర్మ‌తోనూ ఫోటో సెష‌న్స్ లో పాల్గొంటోంది.

అక్కా-చెల్లి ఇద్ద‌రు క‌లిసి అందాల దాడికి దిగారంటే? ఆ క‌థ వేరుగా ఉంటుంది. అయితే ఈసారి అంత‌టి సాహ‌సానికి పూనుకోలేదు. నేహా శ‌ర్మ సోలోగానే  అందాల విందు చేసింది. ఇదిగో ఇక్క‌డిలా  ఆరెంజ్ రంగు ప్లోర‌ల్ దుస్తుల్లో అందాల ఆరబోతే ప‌నిగా పెట్టుకుంది. క్లీవేజ్ షో స‌హా  థైషో ఆద్యంతం కుర్రాళ్ల‌లో స‌ల‌ప‌రం పుట్టిస్తుంది.

సోపాపై స‌గం మ‌డిచిన కాలితో కాక‌లు రేపుతోంది. విర‌హ‌వేద‌న భంగిమ‌లో ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. షోల్డ‌ర్ లెస్ ప్లోర‌ల్ క్యాజువ‌ల్స్ లో నేహా ఆహా అనిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

నేహాశ‌ర్మ అభిమానులు ఆద్యంతం ఆస‌క్తిక‌ర కామెంట్లు పోస్ట్ చేస్తూ మ‌రింత హీటెక్కిస్తున్నారు. ఇలాంటి భంగిమ‌లు అమ్మ‌డికి కొత్తేం కాదు. డిజ‌న‌ర్ దుస్తుల్లో నేహ త‌ళుకు బెళుకు సొంపుల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి దుస్తుల్లోనైనా చూప‌రుల‌ను ఆక‌ట్టుకోవ‌డం అమ్మ‌డి ప్ర‌త్యేక‌త‌.

అమ్మ‌డి కెరీర్ సంగ‌తి చూస్తే  ఇప్ప‌టికీ బాలీవుడ్ లో న‌త్త‌డ‌న‌కే సాగుతోంది. 'చిరుత‌'తో  టాలీవుడ్ లో లాంచ్ అయిన అమ్మ‌డు అటుపై కొన్ని సినిమాలు చేసి బాలీవుడ్ కి వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ క‌న్నా బాలీవుడ్ లో మెరుగైన కెరీర్నే  కొన్నాళ్ల పాటు కొన‌సాగించింది.  కానీ న‌వ నాయిక‌లు..సీనియ‌ర్ భామ‌ల మ‌ధ్య ఇమ‌డ లేపోయింది.

ఆ పోటీని త‌ట్టుకుని అవ‌కాశాలు అందుకోవ‌డంలో  వేగం క‌నిపించ‌లేదు. సినిమాలు చేస్తున్నా గ్యాప్ లు త‌ప్ప‌నిస‌రిగా మారాయి. ప్ర‌స్తుతం  రెండేళ్ల వ్య‌వ‌ధి అనంత‌రం 'జోగిరా సా రారా'లో న‌టిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమై నెల‌లు గుడుస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. అలాగే ఓ వెబ్ సిరీస్ లోనూ న‌టిస్తోంది. అయితే టాలీవుడ్ పాన్ ఇండియా క్రేజ్ న‌డుమ మ‌ళ్లీ ఇక్క‌డా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు బాలీవుడ్  మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News