మ‌రో ఇలియానాలా స్లిమ్మ‌వుతోందా?

Update: 2022-02-11 02:57 GMT
గ‌డిచిన కొంత‌కాలంగా అందాల క‌థానాయిక పూన‌మ్ బ‌జ్వా వ‌రుస ఫోటోషూట్లు వెబ్ లో దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. హాట్ కంటెంట్ తో పూన‌మ్ ఫోజులు యూత్ లోకి దూసుకెళుతున్నాయి. తెలుగులో కంబ్యాక్ కోసం ఈ అందాల భామ తీవ్రంగానే ప్ర‌య‌త్నిస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది.  

తాజాగా పూన‌మ్ మేకోవ‌ర్ కి ఫోటోగ్రాఫ్ ఒక‌టి అంత‌ర్జాలంలో సునామీ వేగంతో దూసుకెళుతోంది. ఇంత‌కుముందు బొద్దుగా క‌నిపించిన పూన‌మ్ ఇంత‌లోనే అంత‌గా స్లిమ్మ‌యిపోయిందేమిటో అంటూ యూత్ షాక్ కి గుర‌వుతున్నారు. చూడ‌గానే ఇలియానాలా స్లిమ్మ‌యిపోయింది. త‌న‌ని ఫాలో చేస్తూ నిరంత‌రం ఫిట్నెస్ మంత్రా ప‌టిస్తోందా? అంటూ సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో ఇలియానా కూడా త‌న బొద్దుత‌నాన్ని త‌గ్గించుకునేందుకు జిమ్ముల్లో తీవ్రంగా క‌స‌ర‌త్తులు చేసింది.

ఇప్పుడు పూన‌మ్ బ‌జ్వా మారిన రూపం చూస్తుంటే ఫిట్నెస్ ఫ్రీక్ గా మారిపోయిన‌ట్టే క‌నిపిస్తోంది. బొద్దుత‌నం పూర్తిగా తగ్గింది. ఎంతో స్లిమ్ గా ఫిట్ గా మారిపోయింది. ఇక‌పై తెలుగు హీరోలు నిర్మాత‌లు బ‌జ్వాపై ఓ క‌న్నేయొచ్చు. వ‌రుస‌గా అవ‌కాశాలు క‌ల్పించ‌వ‌చ్చ‌న్న‌మాట‌.

స‌రైన‌ హిట్టు కొడితే కానీ..!

`ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు` చిత్రంతో టాలీవుడ్ లోకి  కంబ్యాక్ అయిన పూన‌మ్ బ‌జ్వా.. ఆ త‌ర్వాత పెద్ద కెరీర్ ని ఆశించింది. కానీ పూన‌మ్ కి మ‌ళ్లీ క‌లిసి రాలేద‌నే చెప్పాలి.  తెలుగులో` మొద‌టి సినిమా`తో న‌టిగా ప‌రిచ‌య‌మైంది. అటు పై మ‌రికొన్ని చిత్రాల్లో న‌టించింది. కానీ కెరీర్ ఏ ద‌శ‌లోనూ  బిజీ అవ్వ‌లేదు.  ప్ర‌స్తుతానికి టాలీవుడ్ లో ఛాన్సుల్లేవ్. మ‌ల‌యాళంలో ఓ చిత్రంలో న‌టిస్తోంది. ఆ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. అయితే పూన‌మ్ స‌మ‌కాలీకులు కొంత‌మంది బుల్లి తెర‌పై బిజీ అవుతున్నారు.

కానీ ఈ భామ మాత్రం అటువైపు చూసింది లేదు. ఓటీటీలోనూ  బెస్ట్ వెబ్ సిరీస్ ల్లో న‌టిస్తూ మార్కెట్ ని బిల్డ్ చేసుకుంటున్నారు. ఆ ర‌కంగాను పూన‌మ్ ప్ర‌య‌త్నాలు క‌నిపించ‌లేదు.

ప్ర‌స్తుతానికి ఈ హాట్ బ్యూటీ సోష‌ల్ మీడియాలో స్పీడ్ చూపిస్తోంది. టెంప్టింగ్ ఫోటోల‌తోనే ఆక‌ట్టుకుంటోంది. అందాల ఆర‌బోత‌ను పూన‌మ్ కాస్త బ్యాలెన్స్ డ్ గానే న‌డిపిస్తోంది.
Tags:    

Similar News