పన్ను మినహాయింపు కోరుతున్న‘ఘాజీ’

Update: 2017-02-22 13:33 GMT
భారత్ పాక్ మధ్య జరిగిన యుద్దాలన్నీ తెలిసినా.. జనబాహుళ్యానికి పెద్దగా తెలీని ఉదంతాన్ని ఘాజీ పేరుతో రూపొందించిన వైనం తెలిసిందే. సముద్ర గర్భంలో దాయాదితో జరిగిన యుద్ధంలో ప్రాణాలకు తెగించి.. నేవీ అధికారులు చేసిన ప్రయత్నాల్ని హుద్యంగా తెరకు ఎక్కించటంలో ఘాజీ చిత్రబృందం సక్సెస్ అయిన విషయం తెలిసిందే. విమర్శకుల ప్రశంసలే  కాదు.. ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఘాజీ నిర్మాతలు కోరుతున్నారు.

ఇటీవల కాలంలో చారిత్రక చిత్రాల్ని.. స్ఫూర్తి రగిలించే చిత్రాలకు పన్ను మినహాయింపులు ఇచ్చేందుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా న్న వేళ.. ఘాజీ చిత్రానికి ఆ అర్హత ఉందని భావిస్తున్నారు చిత్ర నిర్మాతలు. అందుకే.. తమ చిత్రానికి పన్ను మినహాయింపులు ఇవ్వాల్సిందిగా నిర్మాతలు తెలుగు రాష్ట్ర సర్కారును కోరనున్నారు. మరి.. వారి విన్నపానికి ఇద్దరు చంద్రుళ్లు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి కానీ పన్ను మినహాయింపు ఇస్తే.. ప్రయోగాత్మక చిత్రాలు తీసే వారికి ప్రోత్సాహకరంగా మారుతుందనటంలో సందేహం లేదు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఘాజీ కథాంశం మొత్తం ఏపీలోని విశాఖపట్నం కేంద్రంగా సాగితే.. ఈ సినిమా షూటింగ్ మొత్తం తెలంగాణలోని హైదరాబాద్ లోనే సాగింది. ఈ లెక్కన.. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల పన్ను మినహాయింపునకు అర్హత ఉందనటంలో సందేహం లేదని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News