చిత్రం : ‘ఘాజీ’
నటీనటులు: రానా దగ్గుబాటి - కేకే మీనన్ - అతుల్ కులకర్ణి - రాహుల్ సింగ్ - సత్యదేవ్ - తాప్సి పన్ను- ఓంపురి - నాజర్ - భరత్ రెడ్డి - ప్రియదర్శి తదితరులు
సంగీతం: కే
ఛాయాగ్రహణం: మది
ఆర్ట్: శివం రావు
విజువల్ ఎఫెక్ట్స్: వాసుదేవ్
మాటలు: గుణ్ణం గంగరాజు
నిర్మాణం: పీవీపీ సినిమాస్ - మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సంకల్ప్
ఘాజీ.. ఇండియాలో తెరకెక్కిన తొలి అండర్ వాటర్ వార్ బేస్డ్ ఫిలింగా కొంత కాలం నుంచి చర్చనీయాంశమవుతున్న చిత్రం. ట్రైలర్ తో పాటు ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విశేషమూ ఆసక్తి రేకెత్తించింది. సినిమా మీద అంచనాల్ని పెంచింది. మూడున్నర దశాబ్దాల కిందటి నేపథ్యంతో కొత్త దర్శకుడు సంకల్ప్ రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని ప్రత్యేకతేంటో చూద్దాం పదండి.
కథ:
1971లో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో మొదలవుతుందీ కథ. భారత్ ను ఎలాగైనా దెబ్బ తీయాలన్న కసితో ఉన్న పాకిస్థాన్.. మన దేశ నావికా దళాన్ని లక్ష్యంగా చేసుకుని తన బ్రహ్మాస్త్రమైన ఘాజీ సబ్ మెరైన్ ను పంపుతుంది. దీనిపై సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ.. ఎస్-21 సబ్ మెరైన్ ప్రతి దాడికి పంపిస్తుంది. ఈ సబ్ మెరైన్ కు కమాండర్ అయిన రణ్ విజయ్ సింగ్ (కేకే మీనన్) ఆవేశపరుడు కావడంతో అతడిని అదుపులో ఉంచి నేవీ ఆదేశాల మేరకు సబ్ మెరైన్ పని చేసేలా చూసేందుకు అర్జున్ (రానా దగ్గుబాటి)ని ఉన్నతాధికారులు తోడుగా పంపుతారు. ఐతే సబ్ మెరైన్లో వీళ్లిద్దరి మధ్య విభేదాలు తలెత్తుతాయి. మరోవైపు ప్రత్యర్థులపై దాడి చేసే క్రమంలో వీళ్ల సబ్ మెరైనే దెబ్బతిని ప్రమాదంలో పడతారు. ఆ స్థితిలో ఘాజీ దాడిని ఈ బృందం ఎలా ఆపగలిగింది. దేశంలో ఓ ముఖ్యమైన ప్రాంతాన్ని ఎలా రక్షించగలిగింది.. అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
నిజంగా 1971లో ఏం జరిగిందో.. పాకిస్థాన్ సబ్ మెరైన్ ‘ఘాజీ’ ఎలా కూలిపోయిందో.. ‘ఘాజీ’ సినిమాలో చూపించింది ఎంతవరకు నిజమో.. ఎంత వరకు కల్పితమో.. అవన్నీ అప్రస్తుతం.. ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరు మాత్రం ఆకట్టుకుంటుంది. రెండు గంటల 5 నిమిషాల నిడివి ఉన్న ‘ఘాజీ’లో వృథాగా అనిపించే సన్నివేశాలేమీ కనిపించవు. నేరుగా కథను మొదలుపెట్టేసి.. ఎక్కడా పక్కదారి పట్టకుండా సూటిగా ‘ఘాజీ’ వృత్తాంతాన్ని చెప్పాడు దర్శకుడు సంకల్ప్. పాత్రల పరిచయానికి కూడా ప్రత్యేకంగా సమయం ఏమీ తీసుకోలేదు. కథ నడుస్తుంటుంది.. దాంతో పాటే క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్మెంట్ కూడా జరుగుతుంది. కాసేపటికే ప్రతి పాత్రనూ ఆకళింపు చేసుకుంటాం. వాటితో పాటు ప్రయాణిస్తాం. ఐతే చివర్లో ఆశించిన స్థాయిలో ఎమోషన్ తీసుకురావడంలో మాత్రం ఘాజీ టీం ఆశించిన మేర విజయవంతం కాలేకపోయింది. హిందీలోనూ ఈ సినిమాను రూపొందించడం వల్ల పరభాషా నటులు చాలామంది స్క్రీన్ ను ఆక్రమించడం వల్ల కొంత వరకు ఇది మనదైన సినిమాలాగా అనిపించకపోవడం కూడా ఘాజీకి ఉన్న ప్రతికూలత.
రానా-కేకే మీనన్ పాత్రల మధ్య సంఘర్షణే ‘ఘాజీ’లో ప్రథమార్ధాన్ని నడిపిస్తుంది. వారి పాత్రలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో.. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అంతే ఆసక్తికరంగా సాగుతాయి. అనుభవజ్నుడైన కేకే పాత్రను ఆవేశపరుడిగా.. యువకుడైన రానా పాత్రను సంయమనం పాటించేవాడిగా చూపించడంతో వైవిధ్యం కనిపిస్తుంది. ప్రథమార్ధాన్ని రానా-కేకే తమ భుజాలపై నడిపిస్తారు. ఇక ద్వితీయార్ధంలో యుద్ధ నేపథ్యంలో సన్నివేశాలు ఉత్కంఠభరితంగా సాగుతాయి. ముఖ్యంగా పాకిస్థాన్ భారత సబ్ మెరైన్ మీదికి టార్పెడోల్ని ప్రయోగించడం.. వాటిని మన బృందం కాచుకోవడం నేపథ్యంలో సాగే చివరి అరగంటలో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. చివర్లో కొంచెం సన్నివేశాలు కొంచెం డ్రమాటిగ్గా సాగినా.. అంతిమంగా ఏం జరుగుతుందో ముందే అర్థమైనా సరే.. ఉత్కంఠకు లోటుండదు.
కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి దీని తర్వాత ఎలాంటి సినిమా తీస్తాడో.. ఎలా మెప్పిస్తాడో ఏమో కానీ.. ‘ఘాజీ’ని మాత్రం అతను ఎంతో ప్రేమించి తీశాడని అడుగడుగునా తెలుస్తుంది. సబ్ మెరైన్ గురించి అతడికున్న అవగాహన సినిమా ఆద్యంతం కనిపిస్తుంది. ఐతే అవగాహన ఉంది కదా అని డెమో ఇచ్చే ప్రయత్నాలేమ చేయలేదు. కథలో భాగంగానే కొత్త విషయాల్ని తెలివిగా ప్రెజెంట్ చేశాడు. ఇండియాలో వచ్చిన తొలి సబ్ మెరైన్ వార్ ఫిల్మే నియర్ పర్ఫెక్ట్ గా ఉండటం విశేషమే. దర్శకుడికి ఎన్ని హాలీవుడ్ సినిమాలైనా స్ఫూర్తినిచ్చి ఉండొచ్చు గాక.. కానీ మనదైన కథను ఆసక్తికరంగా చెప్పడంలో మాత్రం అతడి ప్రత్యేకత కనిపిస్తుంది.
‘ఘాజీ’లో కొన్ని మైనస్ పాయింట్స్ లేకపోలేదు. ప్రథమార్ధంలో కథనం కొంచెం నెమ్మదిగా సాగుతుంది. ముగింపు నిరాశ పరుస్తుంది. అప్పటిదాకా పతాక స్థాయిలో సాగుతూ వెళ్లిన సినిమాకు ఆ స్థాయి ముగింపు లేకపోయింది. ఘాజీని కూల్చేసే సీన్ మామూలుగా కానిచ్చేశారు. అంతేనా.. అయిపోయిందా అన్న భావన కలిగిస్తుంది పతాక సన్నివేశం. దాదాపుగా యుద్ధానికి సంబంధించిన వ్యవహారంలో స్వేచ్ఛ తీసుకుని.. మలుపులు.. నాటకీయత జోడించినపుడు.. క్లైమాక్స్ విషయంలో ఆ ప్రయత్నం చేయాల్సింది. యుద్ధ సన్నివేశాలన్నీ కూడా ఇండియా కోణంలో కొంచెం డ్రమాటిగ్గా సాగుతాయి. ఇది కచ్చితంగా ఫిక్షనే అన్న భావన కలిగిస్తాయి. మొత్తం కథంతా నీటి లోపలే జరగడం వల్ల కొంత మొనాటనీ అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు రిపీటెడ్ గా అనిపిస్తాయి. పాటలు.. మసాలాలు ఏమీ లేని ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్ని ఇష్టపడేవాళ్లకు ఎంత మేరకు ఎక్కుతుందన్నది కొంత సందేహమే. కానీ కొత్తదనం ఆశించే వారికి మాత్రం ‘ఘాజీ’ మంచి ఛాయిస్.
నటీనటులు:
రానా కెరీర్లో అర్జున్ పాత్ర వన్ ఆఫ్ ద బెస్ట్ గా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. మాటలు చాలా తక్కువ.. పైగా ఎక్కడా ఎమోషన్స్ బయటపడనివ్వకుండా సటిల్ గా..హుందాగా కనిపించాల్సిన పాత్ర అతడిది. చాలా క్లిష్టమైన ఈ పాత్రలో రానా అద్భుత అభినయం ప్రదర్శించాడు. అతడి ఆహార్యం కూడా ఆ పాత్రకు చాలా బాగా సూటయింది. మొత్తంగా రానా ఈ పాత్రతో చాలా కాలం గుర్తుంటాడు. ఇక మిగతా నటీనటులందరూ కూడా పాత్రల్లో గొప్పగా ఒదిగిపోయారు. కేకే మీనన్ స్థాయి ఏంటన్నది ఈ సినిమా తెలియజేస్తుంది. ఆయన పాత్రను చాలా బాగా తీర్చిదిద్దారు.
ఆరంభంలో ఒకట్రెండు సన్నివేశాలతోనే కేకే తన ప్రత్యేకత చూపిస్తాడు. ఆ పాత్రతో ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్టయ్యేలా దాన్ని పండించాడు కేకే. అతుల్ కులకర్ణి కూడా చాలా హుందాగా నటించాడు. తాప్సి ఉన్నంతలో ఓకే కానీ.. ఆమె పెద్దగా చేయడానికేమీ లేకపోయింది. సినిమాలో ఒక్క అమ్మాయైనా ఉండాలి అన్నట్లు తన పాత్రను ఇరికించినట్లుగా అనిపిస్తుంది. సత్యదేవ్.. పాకిస్థాన్ కమాండర్ పాత్రలో రాహుల్ దేవ్ కూడా బాగా చేశారు. ఓంపురి.. నాజర్.. భరత్ రెడ్డి.. ప్రియదర్శి.. వీళ్లవి చిన్న చిన్న పాత్రలు. జస్ట్ ఓకే అనిపించారు. ఐతే ఎక్కువమంది పరభాషా నటులు కావడం వల్ల మన ప్రేక్షకులు వీరితో పెద్దగా కనెక్టవ్వలేరు.
సాంకేతికవర్గం:
టెక్నీషియన్స్ అందరూ కలిసి సినిమాను తమ వైపు నుంచి మరో మెట్టు ఎక్కించే ప్రయత్నం చేశారు. కే బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలో ప్రేక్షకుడిని లీనం అయ్యేలా చేస్తుంది. సబ్ మెరైన్లో ఉన్నట్లే.. మనల్ని మరో ప్రపంచంలో విహరింపజేసేలా కెమెరా పనితనం చూపించాడు మది. మనం నీళ్లలోనే.. సబ్ మెరైన్లోనే ఉన్నామన్న భావనను కలిగించడంలో మది ఛాయాగ్రహణం కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్ట్ వర్క్.. విజువల్ ఎఫెక్ట్స్ కూడా అంతే బాగా కుదిరాయి. సబ్ మెరైన్ సెట్టింగ్ వావ్ అనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ లోనూ మంచి క్వాలిటీ చూపించారు. ఎక్కడా కృత్రిమంగా అనిపించకుండా.. నిజంగా అలాగే జరుగుతున్న భావన కలిగిస్తాయి. హాలీవుడ్ సినిమాలకున్నట్లు వందల కోట్ల బడ్జెట్ అందుబాటులో లేకున్నా.. ఔట్ పుట్ మాత్రం ప్రపంచ స్థాయికి తగ్గలేదు.
టెక్నీషియన్స్ ఎవరికి వాళ్లు పని చేసినట్లు కాకుండా అందరూ సమన్వయంతో పని చేసిన తీరు తెరమీద కనిపిస్తుంది. గుణ్ణం గంగరాజు మాటలు పరిమితంగా ఉంటూనే ప్రభావవంతంగా అనిపిస్తాయి. ఒక తొలి చిత్ర దర్శకుడిని నమ్మి ‘ఘాజీ’ లాంటి సినిమా తీసినందుకు.. రాజీ పడకుండా ఇంత భారీ స్థాయిలో నిర్మించినందుకు పీవీపీ, మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్ వాళ్లకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఒక డెబ్యూ డైరెక్టర్ నుంచి ఇలాంటి సినిమాను ఊహించలేం. సంకల్ప్ ఈ సినిమా కోసం ఎంత పరిశోధించాడో.. దీనిపై ఎంత పని చేశాడో.. సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. తొలి ప్రయత్నంలోనే ఇంత భారీ సినిమాను.. పకడ్బందీగా.. ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. ప్రేక్షకులు మరింత ఎమోషనల్ గా కనెక్టయ్యేలా కథాకథనాల్ని తీర్చిదిద్దుకోవాల్సింది.కొన్ని చోట్ల అనుభవ లేమి కనిపిస్తుంది కానీ.. ఓవరాల్ గా సంకల్ప్ తనదైన ముద్ర వేశాడు. ఉత్కంఠ రేపేలా కథాకథనాలు తీర్చిదిద్దుకోవడంలోనే కాదు.. సరైన నటీనటుల్ని.. సాంకేతిక నిపుణుల్ని ఎంచుకుని వారి నుంచి చక్కటి సమన్వయంతో మంచి ఔట్ పుట్ రాబట్టుకోవడంలోనూ సంకల్ప్ తన ప్రత్యేకత చూపించాడు.
చివరగా: ఘాజీ థ్రిల్లింగ్ జర్నీ
రేటింగ్-3/5
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre