సంక్రాంతికి టాలీవుడ్ లో నాలుగు సినిమాలు వచ్చి, నాలుగు హిట్ అయ్యాయి. యావరేజ్ టాక్ వచ్చిన మూవీస్ కూడా మంచి వసూళ్లు రాబట్టి హిట్టు కొట్టేశాయి. థియేటర్ల కొరతతో మరుసటి వారం గ్యాప్ ఇచ్చినా, ఈ వారం మరో నాలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు - లచ్చిందేవికి ఓ లెక్కుంది - కళావతి - నేనూ రౌడీనే చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే వీటిలో ఏ ఒక్క మూవీకి సూపర్ హిట్ టాక్ రాలేదు.
ఏ క్లాస్ సెంటర్లలో అయితే అసలు పట్టించుకునే వాళ్లు కూడా పెద్దగా కనిపించడం లేదు. మిగతా టౌన్లలో అంతో ఇంతో ఉన్నా.. హైద్రాబాద్ లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏ మూవీకైనా సరే హైద్రాబాద్ సిటీ కలెక్షన్స్ చాలా ముఖ్యమనే చెప్పాలి. 15 రోజుల్లోనే మరీ ఇంతగా పరిస్థితి ఎందుకు మారిపోయిందని ఆరా తీయాల్సి వచ్చింది. ఇలా తీశాక తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. హైద్రాబాద్ లో జరుగుతున్న మేయర్ ఎలక్షన్స్ గట్టి దెబ్బే కొట్టాయని.
ఎన్నికలకి, సినిమాలకు సంబంధం ఏంటయ్యా అంటే.. సిటీలో ఏ సినిమా పబ్లిసిటీకి అయినా.. కీలకం హోర్డింగులే. కానీ హైద్రాబాద్ హోర్డింగుల నిండా పొలిటికల్ లీడర్లే కనిపిస్తున్నారు. కొత్త సినిమాలకు హోర్డింగ్ లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక ఉన్న జనాభాలో చాలామంది ప్రచారంలో మునిగిపోయారు. ఈ దెబ్బ నాలుగు సినిమాల వసూళ్లపై గట్టిగానే పడింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... సంక్రాంతి సినిమాలకు మాత్రం ఇంకా మినిమం షేర్ వచ్చేస్తోందట.