సినిమాను విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కించడంలో బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలాభన్సాలీ సిద్ధహస్తుడు. బ్లాక్ మినహా ఆయన తీసిన ప్రతి సినిమాల్లో భారీదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తాజాగా రాజపుత్ వంశానికి చెందిన రాణి పద్మావతి కథతో పద్మావతి సినిమా తెరకెక్కిస్తున్నారు. దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రయిలర్ ఇప్పటికే విడుదలై అందరి ప్రశంసలూ అందుకుంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించి ఘామర్ పాటను విడుదల చేశారు. పద్మావతి మూవీలో ఈ పాటకు ఎంతో స్సెషల్ అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ పాట కోసం హీరోయిన్ దీపిక కొన్ని నెలలపాటు ఘూమర్ డ్యాన్స్ ను ప్రాక్టీస్ చేసింది. ఈ డ్యాన్స్ రాజపుత్ స్రీలు పెళ్లయి అత్తవారింటికి వెళ్లే సందర్భంలో చేస్తారు. వెలుగుతున్న దీపాలను పళ్లాల్లో పట్టుకుని గిరగిరా తిరుగుతూ చేసే ఈ నృత్యాన్ని చూస్తుంటే కళ్లప్పగించి చూడాల్సిందే. ఎంతో కష్టమైనా పట్టుదలతో నేర్చుకుని మెప్పించేలా డ్యాన్స్ చేసింది. దీనికితోడు షూట్ సమయంలో ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు.. డ్రస్ బరువు 20 కిలోలకు పైగా ఉందట.
పద్మావతి సినిమాలో ఆమె భర్త పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. పద్మావతిని మోహించే అత్యంత క్రూరుడైన ఖిల్జీ పాత్ర రణ్ వీర్ సింగ్ చేస్తున్నాడు. సంజయ్ లీలా భన్సాలీ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తీశాడు. భన్సాలీ ఊహల్లో ఉన్న పద్మావతి పాత్రకు దీపిక జీవం పోసింది. ఘూమర్ పాటతో పద్మావతి సినిమాపై అంచనాలు కచ్చితంగా మరింత పెరిగిపోతాయి.
Full View