మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మూడు భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. అందులో ప్రధానంగా ముందు వరుసలో నిలిచి హాట్ టాపిక్ గా నిలుస్తున్న మూవీ 'గాడ్ ఫాదర్'. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన మూవీ 'లూసీఫర్'. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించి తెరకెక్కించిన ఈ మూవీని మెగాస్టార్ తో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.
నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్న ఈ మూవీ దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి డాన్ తరహా పాత్రలో 'గాడ్ ఫాదర్'గా నటిస్తున్న ఈ మూవీ ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ టుక్ తో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి మునుపెన్నడూ కనిపించని విధంగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచారు.
అంతే కాకుండా రీసెంట్ గా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో కూడా సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేయడమే కాకుండా చిరు సినిమాల్లో ఇదొక డిఫరెంట్ ఫిల్మ్ గా వుండబోతోందనే సంకేతాల్ని అందించింది. చిరు లుక్, మేకోవర్, డ్రెస్టింగ్ స్టైల్ ఇలా ప్రతీ విషయంలోనూ డిఫరెండ్ గా ప్లాన్ చేసిన తీరు సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేస్తోంది. ఇదిలా వుంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కోసం ఈ మూవీ నుంచి సర్ ప్రైజ్ ని ప్లాన్ చేశారు.
ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సెలబ్రేషన్స్ జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫ్యాన్స్ నెట్టింట సెలబ్రేషన్స్ స్టార్ట్ చేయడంతో 'గాడ్ ఫాదర్' మేకర్స్ ఫ్యాన్స్‌ని మరింతగా హ్యాపీ చేయడం కోసం టీజర్ తో సర్ ప్రైజ్ ప్లాన్ చేశారట. ఈ మూవీ టీజర్ ని ఆగస్ట 21న అంటే చిరు పుట్టిన రోజుకు ఒక రోజు ముందే విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా గురువారం కొత్త పోస్టర్ ని విడుదల చేశారు.
తాజా పోస్టర్ బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్ లో వుండగా చిరు అందులో సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. బ్లాక్ గాగుల్స్ ధరించి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చిరు కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఇన్నేళ్ల కెరీర్ లో చిరు ఈ తరహా లుక్ లో కనిపించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీలో సునీల్, పూరి జగన్నాథ్, గంగవ్వ, బిగ్ బాస్ దివి నటిస్తున్నారు. ఈ మూవీకి ఛాయాగ్రహణం నీరవ్ షా, సంగీతం తమన్, ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ సురేష్ సెల్వరాజ్.