బడ్జెట్ : సినిమా రంగానికి తీపి కబురు

Update: 2019-02-01 10:51 GMT
ఎప్పుడూ వివక్షకు గురయ్యే సినిమా రంగానికి ఈసారి బడ్జెట్ లో అగ్రతాంబూలం దక్కింది. తాజాగా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి కేంద్ర బడ్జెట్ లో సినీ రంగంపై వరాల జల్లు కురిపించారు. సినిమాలకు అనుమతుల విషయంలో సరళతరం చేశారు.

భారతీయ సినిమాలకు ఇక నుంచి సింగిల్ విండో పద్ధతిలో షూటింగ్ లకు అనుమతి ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటివరకు ఈ పద్ధతి విదేశీ చిత్రాలకు మాత్రమే ఉండేది. ఇప్పుడు స్వదేశీ చిత్రాలకు కూడా అనుసరించనున్నట్లుగా కేంద్రం ప్రకటించింది.

ఇక సినిమా రంగానికి పెను భారంగా మారిన జీఎస్టీ పన్నును కూడా కేంద్రం తగ్గించింది. 18శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తున్నట్లుగా బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అంతేకాదు.. సినిమా రంగానికి పెను విఘాతంగా ఉన్న పైరసీని అరికట్టేందుకు యాంటీ కామ్ కార్డింగ్ ప్రొవిజన్ యాక్ట్ ను సినిమాటోగ్రఫి చట్టానికి జత చేయనున్నట్లుగా తెలిపారు.
Tags:    

Similar News