అడవి శేష్ హీరోగా శోభిత ధూళిపాళను హీరోయిన్ గా పరిచయం చేస్తూ తీసిన గూఢచారి ఆగస్ట్ 3న విడుదల కానున్న సందర్భంగా ట్రైలర్ ఇందాకా రిలీజ్ చేసారు. శశికిరన్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగులో చాలా కాలం తర్వాత వస్తున్న స్పై థ్రిల్లర్. కథను దాదాపుగా రివీల్ చేసిన టీమ్ ప్రేక్షకులను ప్రిపేర్ చేయటంలో భాగంగా ఇది చేసినట్టుగా కనిపిస్తోంది. రా ఏజెంట్ గా పనిచేసి దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన తండ్రిని ఆదర్శంగా తీసుకున్న గోపి అనే పిల్లాడు పెరిగి పెద్దయ్యాక అర్జున్ అనే మారుపేరుతో తన కంట్రీ కోసం ఒక పెద్ద మిషన్ ను నెరవేర్చే క్రమంలో తనపై ఆఫీసర్ ప్రకాష్ రాజ్ గైడెన్స్ లో ఏం చేసాడు అనేదే దీని కథగా కనిపిస్తోంది. కొత్త తరహా విజువల్స్ తో యాక్షన్ ఎపిసోడ్స్ తో ట్రైలర్ లో మంచి ఫ్రెష్ నెస్ ఉంది. ఇలాంటి ట్రీట్ మెంట్ రెగ్యులర్ మాస్ సినిమాల్లో కనిపించదు కాబట్టి విషయం ఉందనే అభిప్రాయం కలిగేలా కట్ చేసారు.
అడవి శేష్ పాత్రకు బాగా సూట్ అయినట్టు కనిపిస్తుండగా అనీష్ కురువిల్లాతో పాటు పవన్ కళ్యాణ్ మొదటి సినిమా హీరోయిన్ సుప్రియ యార్లగడ్డ కీలకమైన పాత్ర దక్కించుకున్నట్టు కనిపిస్తోంది. ఏజెంట్ గా అర్జున్ ఎదురుకున్న ఛాలెంజులు అవమానాలు మంచి యాక్షన్ డోస్ లో దట్టించినట్టు చూపించేసారు. షానియేల్ డియో కెమెరా పనితనం హై స్టాండర్స్ లో ఉండగా శ్రీచరణ్ పాకాల సంగీతం కూడా ఎలివేట్ అయ్యేలా ఉంది. మోడల్ గా హాట్ నెస్ కు మారుపేరుగా ఉన్న శోభిత తో లిప్ లాక్ కిస్సులు యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. డిఫరెంట్ జానర్ లో రా ఏజెంట్ గా వస్తున్న గూఢచారి రా అండ్ రియలిస్ట్ గా ఉంది. మరి ఇంత గ్రిప్పింగ్ గా సినిమా ఉంటే మాత్రం వర్క్ అవుట్ అయినట్టే.
వీడియో చూడటానికి క్లిక్ చేయండి
Full View