చదువుపై మనసు పెట్టకుండా.. కనీసం టెన్త్ కూడా పాస్ కానీ ఓ వ్యక్తి.. ఫిలింఫేర్ అందుకోగలడా? ఈ ప్రశ్నకు సహజంగా లేదు అనే సమాధానమే వస్తుంది. కానీ గోపీసుందర్ మాత్రం సాధ్యమే అని నిరూపించాడు. తన టెన్త్ సర్టిఫికేట్ ని ఫేస్ బుక్ లో పెట్టి మరీ.. అంతగా చదువు అబ్బని చాలామందికి స్ఫూర్తినిచ్చేందుకు ప్రయత్నం చేశాడు. ఇప్పుడు లైఫ్ లో బాగానే సెటిల్ అయిన గోపీ సుందర్.. తన మూడో సినిమా 'అన్వర్' (మలయాళం)తోనే ఫిలిం ఫేర్ అందుకున్నాడు.
తెలుగులో ఆరు సినిమాలకు మ్యూజిక్ ఇస్తే.. ఆరింటితోనూ హిట్స్ సాధించి.. డబుల్ హ్యాట్రిక్ సాధించాడంటే గోపీసుందర్ ఏ స్థాయి సంగీతం అందిస్తాడో అర్ధం చేసుకోవచ్చు. కానీ ఈ కంపోజర్ మాత్రం మొదట్లో తన కెరీర్ పై చాలా భయపడేవాడట. చదువు సరిగ్గా అబ్బక మ్యూజిక్ కాలేజ్ లో చేరితే.. దశాబ్దాల అనుభవం ఉన్న అక్కడి మాస్టారు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కోవడం చూసి.. భయం వేసిందట. ఆ తర్వాత సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఔసెపచ్చన్ దగ్గర శిష్యరికం చేసినపుడు.. ఆయన పరిస్థితి కూడా అలా డబ్బులకు కొట్టుమిట్టాడుతూనే ఉండడం చూసి.. తన ఫ్యూచర్ పై భయపడ్డానని చెబుతున్నాడు.
అందుకే యాడ్ ఏజన్సీలతో పరిచయం పెంచుకుని రేడియో కార్యక్రమాలకు.. టీవీ యాడ్స్ కు మ్యూజిక్ ఇచ్చేవాడట గోపీ. ఏకంగా 5వేల ప్రకటనలకు పైగా మ్యూజిక్ ఇచ్చిన ట్రాక్ రికార్డ్ ఈన సొంతం. తెలుగులో 'నోట్ బుక్'కి మొదట బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వగా.. ఆ త్రవాత ప్రియదర్శనమ మూవీ ధోల్ కి నేపథ్య సంగీతం ఇచ్చి.. ఆ తర్వాత మోహన్ లాల్ మూవీ ఫ్లాష్ తో పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా మారాడు గోపీ సుందర్. మూడో సినిమా అన్వర్ కే ఫిలింఫేర్ రావడంతో.. ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని.. ఇప్పుడు లైఫ్ లో సెటిల్ అయ్యానని.. అంటున్నాడు సంగీత దర్శకుడు గోపీ సుందర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/