ఆ ప్రచారం అబద్ధం-గోపీచంద్

Update: 2017-07-24 07:44 GMT
తన కొత్త సినిమా ‘గౌతమ్ నంద’ బడ్జెట్ ఎక్కువైపోయినట్లు.. నిర్మాతలు డెఫిషిట్ తో సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదంటున్నాడు గోపీచంద్. ఈ సినిమాను దర్శకుడు సంపత్ నంది అనుకున్న బడ్జెట్లోనే తీశాడని అతను చెప్పాడు. ‘‘గౌతమ్ నంద బడ్జెట్ ఓవర్ అయిందని.. వర్కింగ్ డేస్.. ఖర్చు బాగా పెరిగిపోయిందని.. నిర్మాతలు ప్రమాదంలో ఉన్నారని ప్రచారాలు జరుగుతున్నాయి. నిజానికి అలాంటిదేమీ లేదు. నా కెరీర్లో ఇది హైయెస్ట్ బడ్జెట్లో తెరకెక్కిన సినిమా అన్నది వాస్తవం. ఐతే చాలా పెద్ద స్కేల్ ఉన్న ఈ సినిమాకు కేవలం ఐదు రోజులు మాత్రమే అదనపు వర్కింగ్ డేస్ అవసరమయ్యాయి. నిర్మాతలు సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఎంత ఖర్చు పెట్టాం.. ఎంత ఎక్కువైంది అన్నది పక్కనబెడితే.. నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ తో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. బిజినెస్ బాగా జరిగింది. బయ్యర్లు కూడా లాభాలు అందుకుంటారనే నమ్మకముంది. సినిమా అంత బాగా వచ్చింది. నా కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్టవడం గ్యారెంటీ’’ అని గోపీచంద్ అన్నాడు.

ఐతే ‘గౌతమ్ నంద’ నిర్మాతలు భగవాన్.. పుల్లారావుల పరిస్థితి ఏమంత బాగా లేదన్నది ఇండస్ట్రీ టాక్. అందుకు ఈ ఒక్క సినిమానే కారణం కాదు. దీనికి ముందు వాళ్లు నిర్మించిన ‘రెబల్’ భారీ నష్టాలు మిగిల్చింది. తర్వాత గోపీచంద్ ‘జగన్మోహన్ ఐపీఎస్’ అనే సినిమా మొదలుపెట్టి సగం షూటింగ్ అయ్యాక దాన్ని ఆపేశారు. ఆ సినిమా తర్వాత వేరే వాళ్ల చేతికెళ్లింది. దానికే ‘ఆరడుగుల బుల్లెట్’గా పేరు మార్చి విడుదలకు సిద్ధం చేశారు. కానీ అది విడుదలకు నోచుకోలేదు. ఆ సినిమాకు సంబంధించి కూడా కొన్ని కోట్లు పోగొట్టుకున్నారు భగవాన్.. పుల్లారావు. ‘గౌతమ్ నంద’కు కూడా అనుకున్నదానికంటే బడ్జెట్ ఎక్కువే అయినప్పటికీ.. బిజినెస్ ఆ రేంజిలోనే జరగడంతో నిర్మాతల పరిస్థితి పర్వాలేదన్నట్లే ఉంది.
Tags:    

Similar News