వాళ్ల కష్టం చూస్తే బాధ వేసేది : గోపీచంద్‌

Update: 2021-09-09 02:30 GMT
గోపీచంద్‌ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన సిటీమార్ కరోనా అవాంతరాలను దాటుకుని ఎట్టకేలకు విడుదలకు సిద్దం అయ్యింది. సినిమా చిత్రీకరణ మొదలు పెట్టినప్పటి నుండి అంచనాలు భారీగా ఉన్నాయి. కాని మద్యలో కరోనా రావడం వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. తద్వార సినిమా కు వచ్చిన పాజిటివ్ బజ్‌ తగ్గింది అనేది కొందరి వాదన. సినిమా ఓటీటీలో విడుదల కాబోతుందనే చర్చ.. జ్వాలారెడ్డి పాట చర్చ ఇలా ఎప్పుడు ఏదో ఒక విషయమై ఈ సినిమా గురించి చర్చిస్తూనే ఉండటం వల్ల సినిమాకు ఇంకా బజ్ ఉంది అనేది టాక్‌. మొత్తానికి సిటీమార్ థియేటర్ల ద్వారా విడుదలకు సిద్దం అయ్యింది. వినాయక చవితి సందర్బంగా విడుదల కాబోతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

సినిమా ప్రమోషన్‌ లో భాగంగా గోపీచంద్ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పూర్తి స్థాయి కబడ్డీ కాన్సెప్ట్‌ తో సినిమాలు తెలుగు లో చాలా తక్కువ వచ్చాయి. అవి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక మా సినిమాపై కూడా నమ్మకం ఉందన్నాడు. నేను సినిమాలో అమ్మాయిల కబడ్డీ జట్టుకు కోచ్ గా కనిపించబోతున్నాను. సినిమాలో నా పాత్ర చాలా విభిన్నంగా ఉండటంతో పాటు కొత్తగా ఉండటం వల్ల ఓకే చెప్పాను. సిటీమార్‌ కథకు ముందు ఒక ఎడ్యుకేషన్‌ బ్యాక్ డ్రాప్‌ లో కథను సంపత్ నంది చెప్పాడు. ఆ కథ విషయంలో సంతృప్తి కలుగక పోవడంతో నెల రోజుల తర్వాత మళ్లీ వచ్చి కబడ్డీ నేపథ్యంలో సినిమా అంటూ కథ చెప్పాడు. కథ చెప్పిన వెంటనే నచ్చింది. నేను నటించేందుకు సిద్దం అయ్యాను.

అమ్మాయిల కబడ్డీ జట్టులో నిజమైన కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు. వారు నేషనల్స్ వరకు వెళ్లేందుకు పడ్డ కష్టాలను చెబుతున్న సమయంలో షాక్‌ అయ్యేవాడిని. అమ్మాయిలు జాతీయ స్థాయిలో ఆడాలి అంటే మామూలు విషయం కాదు. చాలా చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారు పడ్డ కష్టం గురించి చెప్పిన సమయంలో బాధ వేసేది. ఇక ఇతర అమ్మాయిలు కూడా పట్టుదలతో కబడ్డీ నేర్చుకున్నారు. ఆ సమయంలో వారి మోకాళ్లకు దెబ్బలు తగలడం.. చేతులకు గాయలు అవ్వడం చాలా కామన్‌ గా జరిగేవి. అయినా కూడా వారు ప్రాక్టీస్ కు వచ్చే వారు. వారి కష్టం చూసిన సమయంలో కూడా బాధ కలిగేది అంటూ గోపీచంద్‌ చెప్పుకొచ్చారు. తమన్నాతో గతంలో నటించాల్సి ఉన్నా కూడా డేట్లు కుదరక పోవడం వల్ల ఇప్పటికి ఆమెతో నటించే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చాడు.

--


Tags:    

Similar News