గోపీచంద్ తో తమిళ దర్శకుడు

Update: 2018-01-23 05:38 GMT
తన 25వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న గోపీచంద్ త్వరలో ఓ తమిళ దర్శకుడితో జత కట్టనున్నాడు. గత ఏడాది వచ్చిన రెండు సినిమాలు గౌతం నందా, ఆక్సిజన్ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో కాస్త డీలాగా ఉన్న గోపీచంద్ ఇప్పుడు చేయబోయే ప్రాజెక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. విడుదల దాకా వచ్చి ఆగిపోయిన బి గోపాల్ సినిమా 'ఆరడుగుల బుల్లెట్' ఏమైందో నిర్మాతకు తప్ప గోపీచంద్ కు కూడా తెలియకపోవడం విశేషం. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకునే స్థాయిలో సినిమాలు చేసిన గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర వరస పరాజయాలతో మార్కెట్ పరంగా కొద్దిగా డౌన్ అయ్యాడు.

తమిళ దర్శకుడు తిరు చెప్పిన స్టొరీ లైన్ బాగా నచ్చడంతో దానికి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని విశ్వసనీయ సమాచారం. కోలీవుడ్ లో తీరుకు భీకరమైన ట్రాక్ రికార్డు ఏమి లేదు. అతను ఇప్పటిదాకా తీసిన మూడు సినిమాలు విశాల్ హీరోగా చేసినవే. మొదటిది తమిళ్ లోనే ఫ్లాప్ అయ్యింది. తెలుగులో డబ్ చేసారు కాని విడుదల చేయలేకపోయారు. రెండోది వెంటాడు వేటాడు పేరుతో వస్తే అది కాస్త డిజాస్టర్ గా మిగిలింది.మూడో సినిమా ఇంద్రుడు కంటెంట్ పరంగా పర్వాలేదు అనిపించినా కమర్షియల్ గా విజయం సాధించలేదు. ఇప్పడు తిరు గౌతం కార్తీక్ హీరోగా తీస్తున్న మిస్టర్ చంద్రమౌళి ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. రెజినా ఇందులో హీరొయిన్.

ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న తిరు గోపీచంద్ ను ఒప్పించడం విశేషమే. గోపీచంద్ తన 25వ సినిమా, తిరు మిస్టర్ చంద్రమౌళి సినిమాలు పూర్తి చేయగానే ఇది సెట్స్ పైకి వెళ్లనుంది అని సమాచారం. తిరు దర్శకత్వం వహించబోయే మొదటి తెలుగు సినిమా ఇదే అవుతుంది. ఈ మధ్య మన తెలుగు హీరోలు తమిళ దర్శకులతో చేస్తున్నవి పెద్దగా వర్క్ అవుట్ కావడం లేదు. మరి ఇదైనా అ సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News