ఎట్టకేలకు శ్రీనువైట్లకి మరో ఛాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మ్యాచో స్టారో గోపీచంద్ కరుణించడంతో శ్రీనువైట్ల మూవీ కన్పమ్ అయింది. సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది? పూర్తిచేసి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్న సంగతులు పక్కనబెడితే! ఇప్పుడీ కాంబో ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకొస్తారు? అన్నది నెటి జనుల్లో ఆసక్తికరంగా మారింది.
అందుకు ప్రత్యేక కారణాలు లేకపోలేదు. ఇద్దరు కొంత కాలంగా వైఫల్యాల్లోనే కనిపిస్తున్నారు. ముఖ్యంగా వైట్ల వరుస పరాజయాల్లో ఉన్నాడు. ఈ క్రమంలో ఏ హీరో అతనికి అవకాశం ఇవ్వలేదు. ఆ మధ్య మంచు విష్ణు 'డీ' సీక్వెల్ ఛాన్స్ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. ఇంతలో గోపీచంద్ లైన్ లో కి రావడం తో దాదాపు విష్ణు ఎగ్జిట్ అయినట్లేనని సందేహిస్తున్నారు.
శ్రీనువైట్ల సినిమా చేసి నాలుగేళ్లు అవుతుంది. ఆయన చివరగా 2018లో మాస్ రాజా రవితేజ హీరోగా 'అమర్ అక్బర్ ఆంటోనీ' తెరకెక్కించారు. అప్పటికే రెండు ప్లాప్ ల్లో ఉన్న వైట్లకి ఆ ఛాన్సే కీలకంగా మారింది. కానీ ఆఛాన్స్ ని..రవితేజ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయారు. ఏ దర్శకుడికైనా జయాపజయాలు సహజమే అయినప్పటికీ ఆ ఫెయిల్యూర్ వైట్లని మరింత నిరుత్సాహంలోకి నెట్టింది.
అంతకు ముందు 'మిస్టర్'..'బ్రూస్ లీ' ప్లాప్ లతోనే అదే సన్నివేశం ఎదురైంది. ఒకప్పుడు సక్సెస్ ఫుల్ మేకర్ గా దూసుకుపోయిన వైట్ల కెరీర్లో అదోక బ్యాడ్ ఫేజ్ అని చెప్పాలి. ఇప్పుడా ఫేజ్ నుంచి బయట పడేయడానికి గోపీచంద్ నడుం బిగించినట్లు కనిపిస్తుంది. అయితే మ్యాచో స్టార్ కెరీర్ మరీ అంత జోష్ కనిపించలేదు.
ఖాళీ లేకుండా సినిమాలైతే చేస్తున్నాడు గానీ...బాక్సాఫీస్ ని మోతెక్కించే సినిమా ఈ మధ్య కాలంలో ఒకటీ లేదు. ఇటీవల రిలీజ్ అయిన 'పక్కా కమర్శియల్' యావరేజ్ గా ఆడింది. అంతకు ముందు నటించిన సినిమాలేవి కూడా బాక్సాఫీస్ వద్ద సౌండింగ్ వినిపంచలేదు. ఇలా చాలా బ్యాలెన్స్ గా గోపీచంద్ కెరీర్ సాగుతోంది. ఈ క్రమంలో మార్కెట్ పరంగానూ కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మరి అలాంటి టైమ్ లో శ్రీనువైట్లతో సినిమా రిస్క్ అనే సంకేతాల్ని పాస్ చేస్తున్నాయి. కానీ గోపీచంద్ మాత్రం రిస్క్ ని కూడా రస్క్ అంత వీజీగా తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఛాన్స్ ఇవ్వడం అన్నది గొప్ప విషయం. మరి మ్యాచ్ స్టార్ నమ్మకాన్ని శ్రీనువైట్ల ఎంత వరకూ నిలబెడతారా? చూడాలి. ఇక వైట్ల సక్సెస్ ట్రాక్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ర్టీకి భారీ హిట్లు ఇచ్చిన ట్రాక్ ఆయన సొంతం. 'వెంకీ'..'ఢీ'..'దుబాయ్ శీను'..'రెడీ'..'దూకుడు' ..'కింగ్'..'బాద్ షా' లాంటి సక్సెస్ లు ఆయన సొంతం. ఆ న్మకంతోనే గోపీచంద్ సీనియర్ డైరెక్టర్ ని సీన్ లోకి తీసుకొచ్చినట్లు కనిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.