విలన్ గా కెరీర్ ప్రారంభించి మాస్ హీరోగా బ్రేక్ అందుకుని ఇప్పటికే పాతిక సినిమాలు పూర్తి చేసిన గోపిచంద్ కొత్త సినిమా టైటిల్ చాణక్య ఫిక్స్ అయ్యింది. ఇందాకా అధికారికంగా ప్రకటించారు. కోలీవుడ్ ఫేమ్ తిరుని తెలుగుకు దర్శకుడిగా పరిచయం చేస్తూ ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయినట్టు సమాచారం. ఆ మధ్య రాజస్థాన్ షెడ్యూల్ లో ప్రమాదానికి గురై గోపిచంద్ కొంతకాలం రెస్ట్ తీసుకుంది ఈ చాణక్య కోసమే.
పాతికవ సినిమాగా ఎన్నో అంచనాలు పెట్టుకున్న పంతం ఆశించిన ఫలితం అందుకోకపోవడంతో చాణక్య మీద గోపిచంద్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. టైటిల్ కూడా పవర్ ఫుల్ గా కుదిరింది. వ్యూహాలకు ప్రతివ్యూహాలకు పేరొందిన చాణక్యలో చాలా యాక్షన్ డ్రామా ఉండొచ్చన్న భరోసా టైటిల్ లోనే ఇస్తున్నారు .విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న చాణక్య అబ్బూరి రవి సంభాషణలు సమకూరుస్తున్నారు. వెట్రి పళనిస్వామి ఛాయాగ్రహణం.
టాప్ టెక్నీకల్ టీమ్ ని సెట్ చేసుకున్న చాణక్య ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశం ఉంది కానీ డేట్ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. విశాల్ తో రెండు సినిమాలు చేసిన అనుభవమున్న తిరుకి ఇదే టాలీవుడ్ ఫస్ట్ మూవీ. 2018లో తమిళ్ లో వచ్చిన మిస్టర్ చంద్రమౌళి తర్వాత తిరు దీని మీదే వర్క్ చేస్తున్నారు. చాలా ఏళ్ళ క్రితం మైండ్ గేమ్ ఆధారంగా కమల్ హాసన్ నటించిన చాణక్య తర్వాత మళ్ళి అదే టైటిల్ తో గోపీచంద్ వస్తుండటం విశేషం