టాలీవుడ్ లో యాక్షన్ హీరోగా .. ఫ్యామిలీ హీరోగా గోపీచంద్ కి మంచి పేరు ఉంది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'పక్కా కమర్షియల్' రెడీ అవుతోంది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 1వ తేదీన థియేటర్లకు రానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో గోపీచంద్ పాల్గొన్నాడు. తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను ఆయన అభిమానులతో పంచుకున్నాడు.
అలీ అడిగిగిన ప్రశ్నలకు గోపీచంద్ స్పందిస్తూ .. నా చిన్నప్పుడు ఒంగోలు చుట్టుపక్కల చెప్పుకోదగిన స్కూల్స్ ఉండేవి కాదు. అందువలన నా చదువు కోసం మా నాన్న ఒంగోలు లోనే స్కూల్ పెట్టారు. సినిమాల్లో ఆయన బిజీ అయిన తరువాత ఆ స్కూల్ బాధ్యతలను ఆయన వేరే వారికి అప్పగించారు. నాన్నగారి పేరుతో ఇప్పటికీ ఆ స్కూల్ రన్ అవుతోంది. నాన్న దర్శకుడిగా బిజీ కావడంతో మేము కూడా మద్రాసు వెళ్లిపోయాము. అక్కడి స్కూల్లోనే నేను చదువుకున్నాను.
నాన్న చనిపోవడంతో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేది .. లేకపోతే ఎలా మారిపోయింది అనేది నాకు తెలిసిపోయింది. అప్పటికి నా వయసు తొమ్మిదేళ్లే. నాన్నలేని లోటు అనేది మెంటల్ గా నేను మరింత స్ట్రాంగ్ అయ్యేలా చేసింది. మనుషులు ఎలా ఉంటారనే విషయం అర్థమైంది.
ఆ తరువాత నేను రష్యాలో ఇంజనీరింగ్ చేశాను. అది పూర్తయిన తరువాత సినిమాల్లోకి వచ్చాను. 'తొలి వలపు' సినిమాతో నా కెరియర్ మొదలైంది.ఇంతవరకూ 30 సినిమాలు చేశాను.
రష్యాలో ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఒక రష్యన్ అమ్మాయి నచ్చింది. నేను కాలేజ్ కి వెళ్లే బస్సులోనే ఆమె కూడా వచ్చేది. చాలా రోజుల పాటు ఆమెను చూస్తూ వెళ్లేవాడిని . ఎన్నాళ్లు ఇలా? అనిపించింది. పెళ్లి చేసుకుంటానని అడిగేద్దాం .. ఏదైనా కానీ అని చెప్పేసి, ఒక రోజున నా మనసులోని మాటను చెప్పాను. ఆ అమ్మాయి నేను చెప్పినదంతావింది. తన కంట్రీ వేరు .. నా కంట్రీ వేరు కనుక తమ ఇంట్లో ఒప్పుకోరని చెప్పేసింది. అయితే సరే అన్నట్టుగానే నేను ఉండిపోయాను" అంటూ చెప్పుకొచ్చాడు.