నానికి జెర్సీ వేయించి జాక్ పాట్ కొట్టిన గౌతమ్!

Update: 2019-04-19 15:59 GMT
ధనమూలమిదం జగత్ అంటారు. కానీ అదే సామెత ఫిలిం ఇండస్ట్రీకి వస్తే విజయం మూలమిదం జగత్ అయిపోతుంది.  కారణం అందరికీ తెలిసిందే.  విజయం అనేది ఇక్కడ చాలా అరుదైనది.. అమూల్యమైనది.  ఇక 24 క్రాఫ్ట్స్ లో దర్శకుడి పరిస్థితి మరీ కత్తిమీద సాము.  అందుకే ఇక్కడ ఒక సక్సెస్ సాధించిన దర్శకుడికి వచ్చే గుర్తింపు చాలా ప్రత్యేకం. ప్రస్తుతం 'జెర్సీ' సినిమా విజయంతో గౌతమ్ తిన్ననూరి అలాంటి విజయమే సాధించాడు.. టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు.

సినిమాకు ఇప్పటికే పాజిటివ్ మౌత్ టాక్ వచ్చేసింది. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. సెలబ్రిటీలు కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలామంది హీరోలు గౌతమ్ ను అభినందిస్తున్నారు.  కొంతమంది ఇప్పటికే గౌతమ్ తో పని చేసేందుకు సంకేతాలు కూడా ఇస్తున్నారట. ఇలా హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తే నిర్మాతలు ఊరుకుంటారా?  గౌతమ్ కోసం టాప్ ప్రొడక్షన్ హౌసులు అడ్వాన్సులు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

గౌతమ్ తన మొదటి సినిమా 'మళ్ళీ రావా' తో మంచిపేరు తెచ్చుకున్నాడు కానీ ఇలాంటి ఇంపాక్ట్ అయితే లేదు.  ఈ సారి నాని స్టార్ పవర్ కూడా తోడు కావడంతో సినియా నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయింది.  ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గౌతమ్ హాజరు కాలేదు.. అక్కడ గౌతమ్ వైఫ్ ను.. తనయుడిని స్టేజ్ మీదకు పిలిచి.. నాని మాట్లాడిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి.  గౌతమ్ తనయుడిని ఉద్దేశించి.. "మీ నాన్న చాలా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమాను అర్థం చేసుకునేంత వయసు మెచ్యూరిటీ నీకుందో లేదో నాకు తెలీదు కానీ పెద్దయ్యాక మాత్రం నువ్వు గౌతం కు బిగ్గెస్ట్ ఫ్యాన్ అవుతావు" అన్నాడు. ఇంకా గౌతమ్ పెద్ద డైరెక్టర్ అవడం ఏంటి.. ఆల్రెడీ అయిపోయాడు!
 
Tags:    

Similar News