సంక్రాంతి పండుగ అంటే టాలీవుడ్ లో సినిమా పండుగ. పెద్ద సినిమాలతో థియేటర్లన్నీ కళకళలాడుతుంటే.. సినిమా హాళ్లు జనాలతో కిక్కిరిసిపోయి ఉంటాయి. అయితే కరోనా కారణంగా గతేడాది మీడియం రేంజ్ సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా ఉండటంతో ఈసారి సంక్రాంతి కి బాక్సాఫీస్ వార్ గట్టిగానే ఉంటుందని అందరూ ఫిక్స్ అయ్యారు. టాలీవుడ్ స్టార్ హీరోలు తగ్గేదే లేదంటూ బరిలో దిగుతున్నారు.
2022 సంక్రాంతి సీజన్ లో రాబోతున్నట్లు 'ఆర్.ఆర్.ఆర్' 'భీమ్లా నాయక్' 'రాధే శ్యామ్' వంటి మూడు భారీ చిత్రాలు అధికారికంగా ప్రకటించాయి. మధ్యలో 'బంగార్రాజు' కూడా రావాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. దీంతో ఈసారి పండక్కి రెండు పాన్ ఇండియా సినిమాలు.. రెండు ప్రాంతీయ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఒకేసారి స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలోకి రావడం అనేది అంత మంచి విషయం కాదు.
సినిమా సినిమాకూ కనీసం వారం అన్నా గ్యాప్ ఉంటే ఏ నిర్మాతా నష్టపోకుండా ఉంటారు. ఇంతకముందు టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఇదే పద్ధతి ఫాలో అయ్యేవారు. ఇప్పుడు కరోనా నేపథ్యంలో సినిమాలు వాయిదా పడటంతో అన్నీ ఒక్కసారిగా థియేటర్ల మీదకు దండయాత్ర చేయాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో కూడా మహేష్ బాబు నిర్మాతల శ్రేయస్సు కోరి తన 'సర్కారు వారి పాట' చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే ఒకేసారి నలుగురు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ చేయడం వల్ల ఆరోగ్యకరమైన పోటీ ఉండదని భావించి.. విడుదల వాయిదా నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' చిత్రాన్ని కూడా వాయిదా వేస్తారని టాక్ నడిచింది. అయితే మేకర్స్ సంక్రాంతి కే ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు మరోసారి రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంటే ఈసారి సంక్రాంతి బరిలో మూడు సినిమాల మధ్య ఫైట్ ఖాయమైందన్నమాట. ట్రేడ్ పరంగా చూసుకుంటే ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవడం కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి రిలీజుల సమస్యల పరిష్కారానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
ఈరోజు బుధవారం టాలీవుడ్ పెద్దల నడుమ రాబోయే సంక్రాంతి కి విడుదల తేదీలను ప్రకటించిన సినిమాలకు సంబంధించి ఓ కీలక మీటింగ్ జరుగుతుందని సమాచారం. పెద్ద పండక్కి రాబోయే సినిమాల విడుదలకు సంబంధించి సామరస్య పరిష్కారం కోసం గిల్డ్ పెద్దలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారట. ఈ మీటింగ్ లో నిర్మాతలు అందరూ ఏకాభిప్రాయానికి వస్తే సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల జాబితాలో మార్పులు చూడొచ్చని టాక్ నడుస్తోంది. మరి ఈ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.