గిల్డ్ కొత్త రూల్‌.. ఇర‌కాటంలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్!

Update: 2022-08-19 23:30 GMT
టాలీవుడ్ క‌రోనా త‌రువాత తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంద‌ని, ప్రేక్ష‌కుల మైండ్ సెట్ లోనూ విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయ‌ని, ఓటీటీల కార‌ణంగా కంటెంట్ వున్న సినిమాల‌కే వ‌స్తున్నార‌ని, అదే కంటెంట్ లేని సినిమాల‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, అంతే కాకుండా నిర్మాణ వ్య‌వ‌యం కూడా భారీగా పెరిగిపోయింద‌ని, స్టార్ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల పారితోషికాలు భారీగా పెరిగిపోయాయ‌ని ఈ స‌మ‌స్య‌లు కొలిక్కి రావాలంటే షూటింగ్ బంద్ ఒక్క‌టే మార్గమ‌ని ఆగ‌స్టు 1 నుంచి బంద్ కు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే.

దీంతో ఆగ‌స్టు 1 నుంచి టాలీవుడ్ లో ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్‌, నిర్మాత‌ల మండలి సార‌ధ్యంలో నిర‌వ‌ధికంగా షూటింగ్ ల బంద్ జ‌రుగుతోంది. ఈ శుక్ర‌వారానికి 19 రోజులు పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో ప్రొడ్యూస‌ర్స్ కీల‌క స‌మ‌స్య‌లపై గ‌త కొన్ని రోజులుగా వ‌రుస భేటీలు జ‌రుపుతున్నారు. నిర్మాణ వ్య‌యాన్ని త‌గ్గించుకుని ప్రేక్ష‌కుల్ని తిరిగి థియేట‌ర్లకు ర‌ప్పించ‌డానికి ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. తాజాగా కీల‌క అంశాల‌పై భేటీ అయినా నిర్మాత‌ల మండ‌లి గురువారం కీల‌క విష‌యాల్ని వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

ఎనిమిది వారాల త‌రువాతే ఏ సినిమా అయినా ఓటీటీలో విడుద‌ల‌వుతుంద‌ని ప్ర‌క‌టించింది. అంతే కాకుండా థియేట‌ర్ల‌లో, మ‌ల్టీప్లెక్స్ ల‌లో ప్రేక్ష‌కుల‌కు అందు బాటు ధ‌ర‌ల్లో ఫుడ్‌, డ్రింగ్స్ వుండేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని ఇందుకు థియేట‌ర్, మ‌ల్టీప్లెక్స్ ల యాజ‌మాన్యాలు సానుకూలంగా స్పందించాయ‌ని తెలిపారు. ఇక కీల‌కంగా నిలిచిన పారితోషికాల‌పై కూడా దృష్టి పెట్టింది. స్టార్ హీరోల రెమ్యున‌రేష‌న్ ల‌తో పాటు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ల పారితోషికాలు, వారి సిబ్బంది బేటాలు, ఫుడ్‌, వెహికిల్, రోజు వారీ వేత‌నాల విష‌యంలోనూ ఓ ఖ‌చ్చిత‌మైన నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట.

ఆర్టిస్ట్ ల‌తో నిర్మాత‌లే నేరుగా పారితోషికాల గురించి చ‌ర్చించ‌డం, మ‌ధ్య వ‌ర్తి వ్య‌వ‌స్థ‌ని ర‌ద్దుచేయ‌డం ఇక ఆర్టిస్ట్ ల రెమ్యున‌రేష‌న్ లోనే త‌న వ్య‌క్తిగ‌త సిబ్బందికిగానీ, బ‌య‌టి ఫుడ్ కి కానీ వారే చెల్లించుకోవాల‌ట‌. షూటింగ్ కి కారు కూడా సొంత ఖ‌ర్చులే పెట్టుకోవాల‌ని క‌ఠిన న‌బంధ‌న‌లు పెట్ట‌డం ఇప్పుడు ఓ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ కు ఇబ్బందిగా మారిన‌ట్టు తెలుస్తోంది. త‌న‌కున్న డిమాండ్ ని బ‌ట్టి స‌ద‌రు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అందినంత భారీగా రోజు వారి ఇవ్వాల‌ని గ‌త కొంత కాలంగా డియాండ్ చేస్తున్నార‌ట‌.

ఇప్ప‌డు ఈ విధానానికి నిర్మాత‌లు ఫేల్ స్టాప్ పెట్ట‌డంతో స‌ద‌రు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప‌రిస్థితి ఏంటా? అని అంతా ఆరాతీస్తున్నారు. త‌ను ఎలా రియాక్ట్ కాబోతున్నాడ‌న్న‌ది కూడా ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో కేవ‌లం న‌లుగురికి మాత్ర‌మే మంచి డిమాండ్ వుంది. దాన్నే క్యాష్ చేసుకుంటూ ఒక్క‌రిద్ద‌రు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు రోజు వేత‌నం కింత భారీగా వ‌సూలు చేస్తూ వ్య‌క్తిగ‌త కారు, సిబ్బంది.. ఫుడ్ విష‌యాల్లో నిర్మాత‌ల‌ని భారీగా పిండేస్తున్నార‌ట‌. ఇప్ప‌డు దీనికి ప్రొడ్యూస‌ర్స్ తాజాగా క‌త్తెర వేశారు.
Tags:    

Similar News