సమస్య ఉందంటే పరిష్కారం చూపాలి మాటలు చెప్పొద్దు

Update: 2020-07-29 09:50 GMT
బాలీవుడ్‌ లో నెపొటిజం తారా స్థాయిలో ఉందని కొత్తగా బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇక్కడ స్టార్స్‌ ఎదగడం సాధ్యం అయ్యే పని కాదని కంగనాతో పాటు ఈమద్య చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. బాలీవుడ్‌ లో బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఎంట్రీ ఇచ్చిన వారిని తొక్కేసేందుకు ఎక్కువ ప్రయత్నాలు జరుగుతున్నాయని చివరకు అవార్డుల విషయంలో కూడా నెపొటిజంను చూపిస్తున్నారంటూ చాలా రోజులుగా కంగనా ఆరోపణలు గుప్పిస్తోంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుల వేడుకలో గల్లీ బాయ్‌ చిత్రంకు గాను ఏకంగా 13 అవార్డులు దక్కాయి. అప్పటి నుండి కంగనా రెచ్చి పోతూనే ఉంది.

గల్లీ బాయ్‌ దర్శకుడు జోయా మరియు హీరో హీరోయిన్‌ రణ్‌ వీర్‌ సింగ్‌ ఆలియా భట్‌ లకు ఇంకా పలువురు చిత్ర యూనిట్‌ సభ్యులకు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు వచ్చాయి. చిత్ర యూనిట్‌ సభ్యులు హోల్‌ సేల్‌ గా అవార్డులను కొనుగోలు చేశాయి అంటూ విమర్శలు వినిపించాయి. తాజాగా ఆ విషయమై గల్లీ బాయ్‌ చిత్రంలో కీలక పాత్రలో నటించిన విజయ్‌ వర్మ స్పందించాడు. అవార్డులను కొనుగోలు చేశారంటూ వస్తున్న వాదనను కొట్టి పారేశాడు. ఆ విషయానికి వస్తే నేను వారితో కలిసి చాలా సినిమాలు చేశాను. నాకు వారితో మంచి స్నేహం ఉంది. మరి నాకు ఎందుకు అవార్డును కొని ఇవ్వలేదు అంటూ ప్రశ్నించాడు.

ఇక నెపొటిజం గురించి స్పందించను అంటూనే ఏదైన సమస్యను గుర్తించినప్పుడు వారే సమస్యకు పరిష్కారం చూపించాలి. అంతే తప్ప ఆ తప్పు వారిది వీరిది అంటూ విమర్శలు చేయడం కాదు. ఆ సమస్యకు పరిష్కారం చేయకుండా ఇతరులను విమర్శించినట్లయితే ఆ సమస్య తగ్గదు అంటూ సున్నితంగా కంగనా రనౌత్‌ కు చురకలు అంటించాడు. తనపై ఇండైరెక్ట్‌ గా విమర్శలు చేసినా కూడా తట్టుకోలేని కంగనా గల్లీబాయ్‌ నటుడు విజయ్‌ వర్మపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News