యంగ్ హీరో సందీప్ కిషన్ 'వెంకటాద్రి ఎక్సప్రెస్' వంటి సాలిడ్ సక్సెస్ కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. 'బీరువా' 'టైగర్' 'నిను వీడని నీడను నేను' వంటి చిత్రాలు విజయాలు అందుకున్నా.. సూపర్ హిట్స్ దక్కలేదనే అనుకోవాలి. ఈ ఏడాది ప్రారంభంలో తన 25వ చిత్రం 'A1 ఎక్స్ ప్రెస్' సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా.. ఆశించిన స్థాయిలో వసూళ్ళు రాబట్టలేకపోయింది. దీంతో ఇప్పుడు లేటెస్ట్ మూవీ ''గల్లీ రౌడీ'' పై ఆశలు పెట్టుకున్నారు సందీప్ కిషన్.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో 'గల్లీ రౌడీ' సినిమా పలుమార్లు వాయిదా పడింది. ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో సందీప్ కిషన్ చిత్రాన్ని సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ క్రమంలో ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా ప్లాన్ చేసుకున్న చిత్ర యూనిట్.. ఇప్పుడు ఉన్నట్టుండి సినిమాని మరోసారి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు వెల్లడించారు. డేట్ మాత్రమే చేంజ్ అవుతోందని.. ఫన్ అలానే ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. అయితే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలోనే విడుదల చేస్తామని.. త్వరలోనే తేదీని కూడా ప్రకటిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు.
'గల్లీ రౌడీ' సినిమాని వాయిదా వేయడానికి యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన 'సీటీమార్' కారణమని తెలుస్తోంది. కబడ్డీ క్రీడ నేపథ్యంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామాని సెప్టెంబరు 3నే విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వీటితో పాటుగా అవసరాల శ్రీనివాస్ ‘నూటొక్క జిల్లాల అందగాడు’.. మేఘా ఆకాష్ ‘డియర్ మేఘ’ వంటి సినిమాలు కూడా అదే రోజున రిలీజ్ అవుతున్నాయి. అలానే హాలీవుడ్ మూవీ 'F 9' (ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-9) కూడా విడుదలకు సిద్ధం అవుతోంది.
ఇవన్నీ విడుదల అవుతున్నట్లు ముందే తెలుసు. కానీ ‘సీటీమార్’ కూడా అదే డేట్ కి వస్తుందనే ప్రకటన వచ్చిన వెంటనే 'గల్లీ రౌడీ' సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పోటీ మధ్య తమ సినిమాని విడుదల చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతోనే సందీప్ కిషన్ సినిమా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని తమ చిత్రాన్ని వాయిదా వేస్తునన్నామని.. సెప్టెంబర్ లోనే సినిమా థియేటర్లలోకి వస్తుంది మని 'గల్లీ రౌడీ' సమర్పకుడు కోన వెంకట్ ట్వీట్ చేశారు.
కాగా, కామెడీ చిత్రాల దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి 'గల్లీ రౌడీ' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సందీప్ కిషన్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. తమిళ నటుడు బాబీ సింహా - రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్ - ఎంవీవీ సినిమా పతాకాలపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ కామెడీ ఎంటర్టైనర్ ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ - సాంగ్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి.