దర్శకుడు గుణశేఖర్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు మార్మోగిపోతోంది. రుద్రమదేవి సినిమాను విమర్శకులు, చరిత్రకారులూ చండాడేసినా కూడా.. జనాలు మాత్రం ధియేటర్లకు తరలి వస్తూనే ఉన్నారు. అసలు ఆడియన్సుకు మాత్రం ఇవన్నీ పట్టట్లేదు. రాణి రుద్రమదేవి గురించి ఏదో చూపించారు.. మేం చూస్తాం.. అనే పంథాలోనే వారు ధియేటర్లకు వచ్చేస్తున్నారు.
ఇకపోతే బ్రూస్ లీ సినిమాను అక్టోబర్ 16న రిలీజ్ చేయకుండా ఆపేయాలని.. అందువలన రుద్రమదేవికి హెల్పవుతుందని ఒక నిర్మాత ఏదో ఒక ఓపెన్ లెటర్ పేరుతో హడావుడి చేయడం.. ఇక దానంతటికీ రామ్ చరణ్ ఎక్సప్లెనేషన్ ఇవ్వడం ఇప్పుడు పెద్ద టాపిక్ అయిపోయింది. ఎందుకంటే చెర్రీ చాలా స్ట్రయిట్ గా కొన్ని చెప్పేశాడు..''బాహుబలి-శ్రీమంతుడు-కిక్2 సినిమాల టైములో వారు ముందే మాట్టాడుకుని రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకున్నారు. ఇకపోతే గతంలో ఆగడు సినిమా వస్తోంది అనగానే.. ముందుగానే మేం డిస్కస్ చేసుకొని గోవిందుడు అందరివాడేలే సినిమాను ఓ రెండు వారాలు వెనక్కి జరిపేశాం. ఇక డిస్కస్ చేయకుండా గుణశేఖర్ డేటును ఫిక్సు చేస్తే ఎలా?'' అంటూ కాస్త ఓపెన్ గానే వడ్డించేశాడు.
నిజానికి ఈ విషయంలో గుణ కూడా పెద్దగా ఫీలవ్వట్టేదు. ఎందుకంటే బ్రూస్ లీ వచ్చే వరకు ఉంది కేవలం వారం రోజులే. ఆ వారం రోజులూ పూర్తిగా సెలవలే. ఏదో మామూలు మండే అంటే కలెక్షన్లు డ్రాప్ అవుతాయ్ అని ఖంగారుపడాలి కాని.. ఇలా ఫుల్ గా సెలవులు ఉన్నప్పుడు ఇంకా ఖంగారు పడటం ఎందుకు? ఇదంతా ఒకెత్తయితే.. కొందరు ఫిలిం ఛాంబర్ పెద్దలయితే.. 'అసలు బ్రూస్ లీ ఎఫెక్టు ఉంటుందని గుణశేఖరే ఖంగారుపడట్లేదు. 9న సినిమా వస్తే హ్యాపీగా 3 వారాలు ఆడే ఛాన్సుందని ఆయన ప్లానింగ్. ఆయనకే లేని బాధ.. మనకెందుకు?''