బాహుబలికి జాతీయ స్తాయిలో అవార్డు రావడం పట్ల తెలుగు ఇండస్ట్రీలోనే భిన్నమైన వాదనలు వినిపించాయి. బాహుబలి తెలుగు సినిమా స్థాయిని పెంచిందని కొందరు భావిస్తుంటే.. మరికొందరు అసలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపొతున్నారు. 'బాహుబలి'కు మించి తెలుగు ఇండస్ట్రీలో గొప్ప సినిమా చాలా వచ్చాయని వారి వాదన. వాటన్నింటికి మానేసి బాహుబలికి అవార్డు ఇవ్వడం పట్ల ఏదో తతంగం జరిగిందని మాట్లాడుకుంటున్నారు.
కొంతమంది దర్శకులు బయటకు చెప్పకపోయినా.. వారు కూడా బాహుబలి కి అవార్డు ఇవ్వడం పట్ల సంతృప్తికరంగా లేరు. దర్శకుడు గుణశేఖర్ అభిప్రాయం కూడా అదేనట. గ్రాఫిక్స్ మాయ తప్ప సినిమాలో ఏముందని గుణశేఖర్ బాహుబలి పాటల తన అక్కసును వెళ్ళగక్కారు. 'బాహుబలి' సినిమా తరువాత విడుదలయిన 'రుద్రమదేవి' సినిమాలో ఒక చరిత్ర ఉందని, అలాంటి 'రుద్రమదేవికి' అవార్డు ఇవ్వకుండా 'బాహుబలి'కి ఎందుకిచ్చారని గుణ తన సన్నిహితుల దగ్గర వాపోతున్నాడని టాక్.