ఓ దర్శకుడో, నిర్మాతో కష్టాల్లో ఉంటే డబ్బులిచ్చి ఆదుకోకున్నా పర్వాలేదు.. పరోక్షంగానైనా సాయం చేస్తే చాలు. ఆ సాయం అందకే పాపం గుణశేఖర్ అల్లాడిపోతున్నాడు. ప్రాణం పెట్టి చేసిన సినిమా.. ఆస్తులు తాకట్టు పెట్టి తెరకెక్కించిన సినిమా.. ‘రుద్రమదేవి’కి కాస్తం సాయం పట్టండయ్యా అంటే ఆదుకునే వారు కనిపించట్లేదు. ఆయన కోరుతున్న సాయం.. రెండు వారాలం విరామం. తన సినిమా వస్తున్నపుడు అటు ఇటు పెద్ద సినిమాల్లేకుండా కొంచెం గ్యాప్ ఇవ్వమంటున్నాడు.
కానీ ‘రుద్రమదేవి’కి ఆ ఛాన్స్ దొరకట్లేదు. అక్టోబరు 9న రిలీజ్ డేట్ ప్రకటిస్తే ఇంకో వారానికే ‘బ్రూస్ లీ’ వచ్చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ విషయంలో హడావుడి పడుతుండటంతో విడుదల వాయిదా పడుతుందేమో అని చూశాడు గుణ. కానీ అలాగేమీ కనిపించట్లేదు. అనుకున్నట్లే అక్టోబరు 16న సినిమా వచ్చేస్తోంది. దీంతో ‘రుద్రమదేవి’ని వాయిదా వేయక తప్పేలా లేదని సమాచారం.
ఐతే ఈసారి వాయిదా వేస్తే ‘రుద్రమదేవి’కి జరిగే డ్యామేజీ అంతా ఇంతా కాదు. ఇప్పటికే సినిమా మీద ఆసక్తి బాగా తగ్గింది. పైగా ఈ డేటు కాదనుకుంటే మళ్లీ నెలన్నర దాకా ఖాళీ లేదు. అందుకే డిసెంబరుకు వెళ్లిపోదామని చూస్తున్నాడట. ఐతే గుణ కొత్తగా డేటిస్తాడు సరే. అప్పుడైనా అతను కోరుకున్న రెండు వారాల విరామం దక్కుతుందా లేదా అనేదే సందేహం. ఆ మధ్య బాహుబలి సినిమా వల్ల తన ‘శ్రీమంతుడు’కి ఇబ్బంది కలిగినప్పటికీ.. అలాంటి ప్రెస్టీజియస్ మూవీకి ఛాన్స్ ఇవ్వాలని నెల రోజులు వెనక్కి వెళ్లాడు మహేష్. తన సినిమాకు కూడా మంచిదన్న ఉద్దేశంతోనే అలా చేశాడు. అలాగే మిగతా హీరోలు కూడా ఆలోచించి గుణశేఖర్ అంత కష్టపడి తీసిన ‘రుద్రమదేవి’కి రెండు వారాల విరామం ఇస్తే బాగుంటుంది.