రాణీ రుద్రమదేవి వీరత్వాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నాడు గుణశేఖరుడు. దేశంలోనే తొలి 3డి స్టీరియోస్కోపిక్ చిత్రమిది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి గుణశేఖర్ పట్టు వదలని విక్రమార్కుడిలా శ్రమిస్తున్నాడు. ఇక రిలీజ్ తేదీ దగ్గరికి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 2 రిలీజ్ అంటూ ఇప్పటికే ప్రకటించేశారు. ఈ సినిమాని సైమల్టేనియస్ గా 5 భాషల్లో రిలీజ్ చేసేందుకు గుణశేఖర్ సన్నాహాలు చేస్తున్నారు. అందుకు సంబంధించి అనువాద పనులు శరవేగంగా సాగుతున్నాయి.
తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడంలో రుద్రమని రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2 నుంచి 4 మధ్యలో ప్రతిచోటా రిలీజ్ కి వస్తుందని అంతా చెప్పుకుంటున్నారు. వాస్తవానికి బాహుబలి చిత్రాన్ని తొలుత నాలుగు భాషల్లోనే రిలీజ్ చేశారు. మరి ఆ చిత్రంతో పోలిస్తే ఒక ఆకు ఎక్కువ తిన్నట్టే కదా రుద్రమదేవిగా అనుష్క వీరత్వం ప్రదర్శించబోతోంది. బంధిపోటు గోనగన్నారెడ్డి పాత్రలో హీరో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. గన్నారెడ్డి పాత్ర సినిమా ఆద్యంతం ఉంటుందని చెబుతున్నారు. అలాగే చాళుక్య వీరభద్రుడి గా రానా అత్యంత కీలకమైన పాత్రలో నటించాడు. వీళ్ళ పాత్రలు అభిమానులు ఫుల్ మీల్స్ ఉంటాయట.
ఇంకా కథానాయికల్లో నిత్యామీనన్, క్యాథరీన్ థెరిస్సా, స్కార్లెట్ వంటి అందగత్తెలు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. సో, గ్లామర్‌కు గ్లామర్ కూడా ఉందనమాట. కాబట్టి రుద్రమదేవి 3డి బాహుబలిని మించిన కలెక్షన్ల ఫీట్ వేస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. తెలుగు ప్రజలంతా గర్వించే సినిమా ఇదవ్వాలని ఆకాంక్షిద్దాం.