ప్రతాపరుద్రుడిపై గుణశేఖర్ రిక్వెస్ట్

Update: 2016-02-28 09:41 GMT
రుద్రమదేవి చిత్రానికి సీక్వెల్ గా ప్రతాపరుద్రుడు చేస్తానని.. ఆ మూవీ ఎండింగ్ లో గుణశేఖర్ అఫీషియల్ గానే ప్రకటించాడు. అప్పట్లోనే స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని ఈ దర్శకుడు చెప్పినా.. ప్రాజెక్ట్ ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. చెప్పిన టైంలో, అనుకున్న బడ్జెట్ లో మూవీని కంప్లీట్ చేయలేకపోవడం గుణశేఖర్ మెయిన్ వీక్నెస్. తనే స్వయంగా నిర్మించిన రుద్రమదేవి విషయంలోనూ ఇదే రిపీట్ అయింది. అందుకే ప్రతాపరుద్రుడి విషయంలో జాప్యం జరుగుతోంది. అసలు ఈ ఆలస్యానికి మెయిన్ రీజన్ టైటిల్ రోల్ చేసే హీరో ఎవరో తేలకపోవడమే.

కాకతీయ సామ్రాజ్యానికి ఆఖరి చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడు పాత్రను... ప్రభాస్ తో చేయించాలని అనుకుంటున్నాడని ఓసారి.. నందమూరి బాలకృష్ణ అయితే.. కరెక్ట్ గా సెట్ అవుతాడని మరోసారి వార్తలొస్తున్నాయి. గోన గన్నారెడ్డి రోల్ ని పర్ఫెక్ట్ గా చేసిన అల్లు అర్జున్ పేరు కూడా కొన్నాళ్లు వినిపించింది. ఈ ముగ్గురితో పాటు మరికొన్ని పేర్లు కూడా వినిపించాయి. దీంతో గుణశేఖర్ కు ఇప్పుడు కొంచెం అసహనం ఫీలయ్యి.. ఓ పబ్లిక్ స్టేట్ మెంట్ పంపించాడు.

'ప్రతాపరుద్రుడు కాస్టింగ్ విషయంలో మేము కానీ, ఆయా హీరోలు గానీ స్వయంగా ప్రకటించే వరకూ ఎటువంటి ఊహాగానాలు నమ్మద్దు' ఇదీ గుణశేఖర్ ఇచ్చిన స్టేట్ మెంట్. బాగానే ఉంది కానీ.. అసలు ఎవరు టైటిల్ రోల్ చెప్పేస్తే సరిపోతుంది. ఆ పని చేయకుండా.. ఈ డొంక తిరుగుడు ఎందుకనే కామెంట్స్ ఒకవైపు వినిపిస్తున్నాయి. మరోవైపు.. గతంలో గోనగన్నారెడ్డి రోల్ విషయంలో ఇలాగే చాలా మంది పేర్లు వినిపించినపుడు... గుణ నోరు మెదపలేదు. సినిమా అంతా అయిపోయాక రిలీజ్ ముందు చెప్పాడు కానీ... ముందే మీడియా ఈ విషయాన్ని బైట పెట్టేసిన మాట మర్చిపోయినట్లున్నాడు ఈ దర్శకుడు.
Tags:    

Similar News