ఇటీవలి కాలంలో మేకింగ్ వీడియోలతో రచ్చ రచ్చ చేయడం ఓ ట్రెండ్ అయిపోయింది. ఏ సినిమా రిలీజైనా, దాని మేకింగ్ వీడియో ని అందరికీ చూపిస్తున్నారు. అసలు ఆన్ సెట్స్ వర్కింగ్ స్టయిల్ ఎలా ఉంటుంది? అనేది తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడేదే అయినా .. కొన్నిసార్లు మితిమీరిన అతి ఎక్కువగా ప్రమోటవుతోందంటూ విమర్శలొస్తున్నాయి.
తాజాగా ఎల్బీడబ్ల్యూ, చందమామ కథలు చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు 'గుంటూర్ టాకీస్' తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రేష్మి గౌతమ్, శ్రద్ధాదాస్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ భామలు ఆన్ సెట్స్ ఒకటే రచ్చ. ఇటీవలే ఈ భామలతో పాటు చిత్రయూనిట్ హడావుడి చేస్తున్న మేకింగ్ వీడియో ని ఆన్ లైన్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రేష్మి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. స్వతహా బుల్లితెర నుంచి వెండితెరవైపు అడుగులు వేస్తోంది కాబట్టి అక్కడ చేసే రచ్చనే ఇక్కడా కాసింత ఎక్కువగా చేసిందనిపిస్తోంది. జబర్ధస్త్ పిల్లగా అందరికీ తెలిసిన ఫేసే కాబట్టి రేష్మి ఏం చేసినా ముద్దుగానే ఉంది. ఈ మేకింగ్ వీడియోలో శ్రద్ధాదాస్ కూడా ఓ బిట్ లో ఛమక్ తినిపించింది.
పాడలేవు .. పాడలేవు .. అంటూ మహేష్ మంజ్రేకర్ తో కలిసి రేష్మి ఈ వీడియోలో తెగ హడావుడి చేసింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ వీడియోలో కనిపించడం కొసమెరుపు. అయితే ఇలాంటి వీడియోల వల్ల ప్రమోషన్ జరిగినా ఈ రచ్చేంటి గురూ? అని తిట్టిపోసేవాళ్లు ఉన్నారు.