'గురు'వు గారికి క్లీన్ గా గ్రీన్ సిగ్నల్

Update: 2017-03-24 16:25 GMT
విక్టరీ వెంకటేష్ నటించిన గురు రిలీజ్ కి రెడీ అయిపోయిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే నాటికే రిలీజ్ అవుతుందని భావించిన ఈ చిత్రం.. అనుకోకుండా వాయిదా పడి.. ఎట్టకేలకు తియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. రిలీజ్ ఫార్మాలిటీస్ ను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటున్న గురు.. ఇప్పుడు సెన్సార్ అడ్డంకిని కూడా దాటేసింది.

'గురు' చిత్రాన్ని ఇవాళ తిలకించిన సెన్సార్ సభ్యులు.. సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ.. యూ సర్టిఫికేట్ అందించారు. తమ మూవీకి సింగిల్ కట్ కూడా వేయకుండానే యూ సర్టిఫికేట్ లభించినట్లు నిర్మాతలు తెలియచేశారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన గురు.. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన సాలా ఖడూస్ రీమేక్ అనే సంగతి తెలిసిందే. లీడ్ రోల్స్ లో వెంకటేష్.. రితికా సింగ్ లు నటించగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

ఇక ఇప్పటివరకూ గురు చిత్రం రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుండగా.. ఇప్పుడు మాత్రం అనుకున్న తేదీ కంటే ముందే రిలీజ్ చేసేయనున్నారు. ఏప్రిల్ 7న విడుదల చేయాలని ముందుగా భావించగా.. ఇప్పుడు ఉగాది పండుగ కానుకగా మార్చ్ 31నే విడుదల చేస్తున్నారు. అందుకే ఇప్పుడు సెన్సార్ ఫార్మాలిటీస్ ను కంప్లీట్ చేసింది గురు యూనిట్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News