కుర్ర హీరో.. యాక్సిడెంట్ జస్ట్ మిస్..

Update: 2016-03-28 19:30 GMT
మ్యూజిక్ డైరెక్టర్ నుంచి హీరోగా ప్రమోట్ అయ్యాడు జీవీ ప్రకాష్. బీ గ్రేడ్ సినిమాలు తీస్తున్నాడనే టాక్ ఉన్నా... యాక్టర్ గానే కాదు కమర్షియల్ గానూ సక్సెస్ అయ్యాడు. తన రీసెంట్ మూవీ త్రిష లేదా నయనతారను టాలీవుడ్ కి కూడా తెచ్చి... తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ తనకంటూ ఇమేజ్ సంపాదించుకున్నాడు కూడా.

ప్రస్తుతం జీవీ ప్రకాష్ 'కడవుల్ ఇరుక్కన్ కుమార' అనే తమిళ్ మూవీలో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా అనుకోకుండా ఓ యాక్సిడెంట్ జరిగింది. హీరో జీవీ ప్రకాష్ తోపాటు బాలాజీ కూడా అదే స్పాట్ లో ఉన్నాడు. వీరిద్దరికీ యాక్సిడెంట్ తప్పదని యూనిట్ అంతా అనుకున్నా.. స్ప్లిట్ సెకండ్ లో ఇద్దరూ తప్పించుకున్నారట. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చిన్న చిన్న గాయాలతో యాక్సిడెంట్ తప్పించుకున్న వీరిద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కడవుల్ ఇరుక్కన్ కుమార చిత్రాన్ని రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా.. నిక్కి గల్రానీ, అవికా గోర్ లో హీరోయిన్ లుగా నటిస్తున్నారు రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ మూవీ కూడా.. త్రిష లేదా నయనతార టైప్ లోనే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హీరో పెన్సిల్ - నాకు ఇంకో పేరుంది(ఎనక్కు ఇన్నోరు పేయర్ ఇరుక్కు) సినిమాలతో టాలీవుడ్ లో స్థిరపడేందుకు ట్రై చేస్తున్నాడు.
Tags:    

Similar News