హబీబ్: ఉగ్ర‌శిక్ష‌ణ‌లో త‌న‌యుడు.. వెతుకుతూ వెళ్లిన తండ్రి క‌థ‌!

Update: 2021-08-15 10:30 GMT
తెలుగు హీరో స‌త్య‌దేవ్ తాను న‌టిస్తున్న ప్ర‌తి సినిమాకి ప‌రిణ‌తి ప్ర‌ద‌ర్శిస్తున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. న‌టుడిగా త‌న‌లోని విలక్ష‌ణ‌త‌ను అత‌డు ప్ర‌తిసారీ ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. తాజాగా స‌త్య‌దేవ్ న‌టించిన హిందీ చిత్రం `హ‌బీబ్` కి ఆఫ్ఘన్ సాహిత్యం అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా క‌నిపిస్తోంది. హబీబ్ లోని ఒక ఎమోషనల్ సాంగ్ రిలీజైంది. ఈ పాట విజువ‌ల్స్ ఆద్యంతం ఎంతో ఆహ్లాద‌క‌రంగా అల‌రించాయి.

భారతదేశం - ఆఫ్ఘనిస్తాన్ ప్ర‌జ‌లంద‌రికీ ఈ పాటను అంకితం చేసింది టీమ్. త‌ప్పిపోయిన‌ తన ఏకైక కుమారుడి కోసం వెతుకుతూ భారతీయ ఆర్మీ అధికారుల‌తో క‌లిసి ఒక తండ్రి సెర్చ్ చేస్తున్న వైనం ఈ పాట‌లో ఎంతో ఎమోష‌న్ ని ర‌గిలిస్తుంది. భారతదేశం నుండి ఇతర పిల్లలతో పాటు బాల తీవ్రవాదుల శిక్షణ శిబిరానికి ఆ బాల‌కుడిని త‌ర‌లిస్తారు. అత‌డిని వెతుకుతూ హ‌బీబ్ పాకిస్తాన్ లోకి ప్ర‌వేశిస్తాడు. అయితే పిల్ల‌లు ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఆఫ్ఘనిస్తాన్ కు పంపబ‌డ‌తారు. చివరకు ఆఫ్ఘన్ సైన్యం స‌హా  కొంతమంది పౌరుల మద్దతుతో కుమారుడిని క‌నిపెట్టి  మిగిలిన పిల్లలందరితో పాటు అతనిని తిరిగి తీసుకువచ్చి వారి జీవితాలకు స్వేచ్ఛను ఇచ్చేవాడిగా హ‌బీబ్ ప్ర‌యాణం సాగుతుంది. బిడ్డ‌ను కోల్పోయిన తండ్రిలోని ఆవేద‌న‌ను స‌త్య‌దేవ్ ముఖంలో ఆవిష్క‌రించిన తీరు ఎంతో హుందాగా హృద్యంగా క‌నిపిస్తుంది.

హ‌బీబ్ నిజ‌జీవిత ఘ‌ట‌న‌ల నుంచి రూపొందించిన సినిమా. పాకిస్తాన్ ఐఎస్ ఐ తీవ్ర‌వాదం పిల్ల‌ల‌ను చెర‌ప‌ట్టి ఉగ్ర‌కలాపాల‌కు ప్రేరేపించే శిక్ష‌ణ‌నిస్తుంది. అటువంటి తీవ్రవాద గ్రూపుల వ‌ల్ల‌ పిల్లలపై జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా నిజాయితీగా చేస్తున్న‌ ప్రయత్నమిద‌ని... ప్రపంచంలోని బాధ్యతాయుతమైన పౌరులుగా మనమందరం దీనిని అంతం చేయడానికి ముందుకు రావాలని ద‌ర్శ‌కుడు కోరుకున్నారు. జెన్నిఫర్ అల్ఫోన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించ‌గా.. హబీబ్ సఫీ -కోటి రావు నిర్మిస్తున్నారు. జయ ఫణి కృష్ణ సంగీతం సమకూర్చారు. చూస్తుంటే స‌త్య‌దేవ్ కి పాన్ ఇండియా స్థాయిలో మంచి పేరు తెచ్చే చిత్ర‌మ‌వుతుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక పాట ఆద్యంతం `మ‌నాలి` అందాల న‌డుమ తెర‌కెక్కించార‌ని అక్క‌డ లొకేష‌న్లు చెబుతున్నాయి.



Full View


Tags:    

Similar News