షాకింగ్‌: ఆమెలా క‌నిపిస్తున్న అత‌డు

Update: 2022-08-23 16:30 GMT
అత‌డు గొప్ప‌ ట్యాలెంటెడ్ హీరో. కెరీర్ లో ఎన్నో విల‌క్ష‌ణ పాత్ర‌ల్లో న‌టించి ప‌రిశ్ర‌మ‌లో గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అత‌డు మ‌రో విల‌క్ష‌ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈసారి లేడీ గెట‌ప్ తో అల‌రించ‌నున్నారు. తాజాగా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల కాగా.. దీనిపై నెటిజ‌నులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఫ‌లానా టీవీషోలో ``ఆమె లా క‌నిపిస్తున్న అత‌డు`` అంటూ పోలిక‌లు చెబుతున్నారు. ఇదంతా ఎవ‌రి గురించి అంటే.. ది గ్రేట్ పెర్ఫామ‌ర్ న‌వాజుద్దీన్ సిద్ధిఖి గురించే.

నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్ర‌స్తుతం `హడ్డీ` అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ ను మంగళవారం నాడు విడుదల చేశాడు. ఇది పూర్తిగా రివెంజ్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కుతున్న చిత్రం. ఇందులో న‌వాజుద్దీన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. పోస్టర్ లో అతడు స్త్రీ వేషం ధరించి సింహాస‌నాన్ని త‌ల‌పిస్తున్న భారీ కుర్చీపై కూర్చొని పోజు కొడుతూ క‌నిపించాడు. ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుండి నవాజ్ లుక్ లో ఫెమినిజం గురించి.. స్త్రీ ఆకారం గురించి ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.  అత‌డి మేకోవ‌ర్ పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

ఆశ్చర్యకరంగా కొంద‌రు నెటిజనులు కపిల్ శర్మ షోలో అర్చన పురాణ్ సింగ్ ను గుర్తు చేస్తున్నారు. అర్చనతో నవాజ్ అసాధారణ పోలిక ట్విటర్ లో హాట్ టాపిక్ గా మారింది. నెటిజ‌నులు ట్విట్టర్ లో ఈ లుక్ పై స్పందిస్తున్నారు. ``నవాజుద్దీన్ సిద్ధిఖీ లేదా అర్చన పురాణ్ సింగ్ ఎవరో ఊహించండి?!  హద్ది లుక్ ఇది`` అని ఒక అభిమాని వ్యాఖ్యానించ‌గా..మరో నెటిజన్ ``#హడ్డీ పోస్టర్ లో అర్చన పురాణ్ సింగ్ చాలా భిన్నంగా ఉంది. NGL`` అని రాశారు.

న‌టి కం హోస్ట్ అర్చన పురాణ్ సింగ్ ఈ వ్యాఖ్యలను హార్ట్ ఫుల్ గా స్వీకరించారు. త‌న‌ను నవాజుద్దీన్ సిద్ధిఖీతో పోల్చడం చాలా గొప్ప అభినందన అని అన్నారు. నాకు పర్యాయంగా మారిన హెయిర్ స్టైల్ ఈ పోలికలకు కారణమైంది. కపిల్ షో (ది కపిల్ శర్మ షో) ప్రారంభ భాగంలో నేను ఈ సైడ్-పార్టెడ్ లుక్ ని ఉపయోగించాను..నవాజ్ తో ఏ విధంగానైనా పోల్చడం గొప్ప అభినందనగా భావిస్తాను! అని ఆమె పేర్కొంది.

నవాజుద్దీన్ సిద్ధిఖీ `గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్` సిరీస్-కహానీ-రమణ్ రాఘవ్ 2.0-బ‌జరంగీ భాయిజాన్-సీరియస్ మెన్ వంటి చిత్రాలలో న‌ట‌న‌కు విమర్శకుల ప్రశంసలు పొందారు. న‌టుడిగా కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నారు.

హడ్డీ గురించి ప్ర‌స్థావిస్తే.. నోయిడా -జియాబాద్ సహా పశ్చిమ ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్న ఈ చిత్రాన్ని ఆనందిత స్టూడియోస్ -జీ స్టూడియోస్ కి చెందిన రాధికా నందా - సంజయ్ సాహా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
Tags:    

Similar News