ప్రాన్‌లు, న‌త్త‌లు తింటున్న ఐటెమ్‌ భామ‌

Update: 2016-01-07 07:30 GMT
రొయ్య‌లు - పీత‌లు - న‌త్త‌లు .. వీటిల్ని నూడిల్స్‌ లో నంజుకు తింటే ఎలా ఉంటుంది? ఆ కిక్కే వేరు క‌దూ? సరిగ్గా అలాంటి కిక్కునే ఆస్వాదిస్తోంది ఐటెమ్‌భామ హంసానందిని. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు విదేశాల్లో విహారం చేస్తోంది. ఆ టూర్‌లో భాగంగానే న్యూయార్క్ వెళ్లింది. అక్క‌డ ఓ రెస్టారెంట్‌లో దూరి తిండి ప‌దార్థాలు ఆర్డ‌ర్ వేసింది. ఇందులో ప్రాన్‌ లు - న‌త్త‌లు - ఇత‌ర‌త్రా సీఫుడ్స్ ఉన్నాయి.

వాటిని చూస్తుంటేనే నోరూరిపోతోంది. అవును ఎక్క‌డికి వెళ్లినా  మ‌నిషి ఆలోచించేది ముందుగా తిండి గురించే. క‌డుపులో ఆ ఫుడ్డు ప‌డిన త‌ర్వాతే ఇంకేదైనా ఆలోచిస్తాం. అదే మాన‌వ నైజం. .. అంటూ చెప్పుకొచ్చింది హంసానందిని. మ‌న‌కి ఆహారం మీద ఉన్న ప్రేమ స్వ‌చ్ఛ‌మైన‌ది. వేరే ఏ వ్య‌వ‌హారాల‌పైనా, ఎవ‌రిపైనా అంత స్వ‌చ్ఛ‌మైన ప్రేమ ఉండ‌దు.. అంటూ చెప్పింది అమ్మ‌డు.

అన్న‌ట్టు ఎలానూ కెరీర్ నావ స‌క్సెస్‌ ఫుల్‌ గా న‌డిపిస్తున్నావ్ క‌దా? ఓ బోయ్‌ ఫ్రెండో - ఓ ల‌వ‌రో లేరా అమ్మ‌డూ?  వాళ్ల‌పై అస‌లు ప్రేమ అనేదే లేదా నీకు? ఎందుకిలా క‌ఠినంగా మాట్లాడుతున్నావ్‌? అమ్మాయిలంతా పెళ్లిళ్ల‌తో ఓ ఇంటివాళ్ల‌యిపోతున్నారు. మ‌రి హంస ఆ ముచ్చ‌టేదో చెప్ప‌దెందుకు? ఇలా న‌త్త‌లు తిని - ఫ్రాన్‌ లు బాగా లాగించి, వాటిపైనే నాకు ప్రేమ అంటే ఫ్యాన్స్ హ‌ర్ట‌వ్వ‌రూ?

Tags:    

Similar News